నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
నేపాల్ రాజ కుటుంబంలో రాజు, రాణితో పాటు రాజ కుటుంబానికి చెందిన 9 మందిని క్రౌన్ ప్రిన్స్ అయిన దీపేంద్ర షా 2001 లో సరిగ్గా ఇదే రోజున ఊచకోత కోశాడు

నేపాల్ రాజ కుటుంబంలో రాజు, రాణితో పాటు రాజ కుటుంబానికి చెందిన 9 మందిని క్రౌన్ ప్రిన్స్ అయిన దీపేంద్ర షా 2001 లో సరిగ్గా ఇదే రోజున ఊచకోత కోశాడు. మరణించిన వారిలో అతడి తండ్రి రాజా బీరేంద్ర, తల్లి రాణి ఐశ్వర్య తోపాటు మరో ఏడుగురు రాజ కుటుంబీకులు ఉన్నారు. కుటుంబ సభ్యులను చంపిన తర్వాత దీపేంద్ర తనను తాను కాల్చుకున్నాడు.
ఇది జరుగడానికి కొన్ని గంటల ముందు ప్యాలెస్‌లో జరిగిన విందులో ఒక అతిథితో దీపేంద్ర ఘర్షణకు దిగాడు. కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని దీపేంద్రను తన గదికి పంపించారు. మరుసటి క్షణం దీపేంద్ర మూడు తుపాకులతో గది నుండి బయటకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నిమిషాల్లోనే సొంత కుటుంబానికి చెందిన 9 మందిని చంపాడు. ఊచకోత తర్వాత దీపేంద్ర తనను తాను కాల్చుకున్నాడు. నాలుగు రోజులపాటు దవాఖానలో చికిత్స పొంది ప్రిన్స్ దీపేంద్ర మరణించారు.
ప్రిన్స్ దీపేంద్ర ఇంగ్లండ్‌లోని ఏటన్ కాలేజీలో చదువుకుక్న రోజుల్లో.. నేపాలీ నాయకుడు షంషర్ జంగ్ బహదూర్ రానా కుమార్తె దేవయానీతో ప్రేమలో పడ్డాడు. రాజ కుటుంబం వీరి ప్రేమను ఒప్పుకోలేదు. ఒక వైపు రాజకుటుంబానికి, దీపేంద్రకు మధ్య దూరం పెరగడం ప్రారంభమైంది. మరోవైపు, రాజ కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలలో దీపేంద్ర పాల్గొనడం కూడా తగ్గడం మొదలైంది. ఇది దీపేంద్ర ఆగ్రహానికి దారితీసి ఊచకోత జరిపేట్లు చేసింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2017: పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
2009: అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం, 228 మంది ప్రయాణికులు దుర్మరణం
2008: ఐపీఎల్ మొదటి ఎడిషన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి కప్ గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్
1996: భారత ప్రధానిగా ఎన్నికైన హెచ్డీ దేవెగౌడ
1880: అమెరికాలోని కనెక్టికట్‌లో మొదటి పేఫోన్ సేవ ప్రారంభం
1980: సీఎన్ఎన్ 24 గంటల వార్తల ప్రసారం ప్రారంభం
1930: బొంబాయి వీటీ-పుణె మధ్య మొదటి డీలక్స్ రైలు డెక్కన్ క్వీన్ ప్రారంభం
1955: అమలులోకి వచ్చిన అంటరానితనం నిరోధక చట్టం
1929: ప్రముఖ సినీనటి నర్గిస్ జననం
1926: హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో జననం
1897: రామకృష్ణ మిషన్‌ను స్థాపించిన స్వామి వివేకానంద
1869: తొలి పేటెంట్ పొందిన థామస్ అల్వా ఎడిసన్
ఇవి కూడా చదవండి..
కాంగోలో ఉగ్ర దాడి, 39 మంది మరణం
త్వరలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ : డాక్టర్ అరోరా
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

