ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
నేటి నుండి ఎల్పీజీ సిలిండర్ల కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. తొలి రోజునే ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.122 తగ్గింది.

న్యూఢిల్లీ : నేటి నుండి ఎల్పీజీ సిలిండర్ల కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. తొలి రోజునే ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.122 తగ్గింది. 14.2 కిలోల సిలిండర్ ధరలో మార్పు లేదు. అంతకుముందు మే 1 న వీటి ధర రూ.45.50 తగ్గింది.
దేశీయ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ నుంచి రూ.215 పెరిగింది. నవంబర్‌లో ఢిల్లీలో సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ ధర రూ.599 గా ఉంది. డిసెంబర్ 1 న దాని ధర రూ.644 కు పెరిగింది. డిసెంబర్ 15 న రూ.50 పెరిగింది. ఫిబ్రవరి 4 న రూ.25 పెరిగి రూ.719 కి చేరుకున్నది. దీని తర్వాత ఫిబ్రవరి 15 న మళ్లీ సిలిండర్‌కు రూ.50 పెంచారు. ఫిబ్రవరి 25 న సిలిండర్‌కు రూ.25, మార్చి 1 న రూ.25 పెరుగడంతో సిలిండర్ ధర రూ.819 లకు చేరుకున్నది. ఏప్రిల్ 1 న రూ.10 తగ్గించారు. ఇదే విధంగా దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరను డిసెంబర్ నుంచి రూ.215 పెంచారు.
గత ఏడేండ్లలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.809 కు పెరిగింది. 2014 మార్చి 1 న.. 14.2 కిలోల దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ.410.5 గా ఉండగా.. ఇప్పుడు రూ.809 కు పెరిగింది. మరోవైపు, ఏడేండ్ల క్రితం పెట్రోల్ లీటరుకు రూ.70 కి దగ్గరగా ఉండగా.. ఇప్పుడది రూ.100 దాటింది.
ఇవి కూడా చదవండి..
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
ప్రధాని కలల ప్రాజెక్టులో ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
నేపాల్ రాజ కుటుంబం ఊచకోత.. చరిత్రలో ఈరోజు
కాంగోలో ఉగ్ర దాడి, 39 మంది మరణం
త్వరలో మిక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ : డాక్టర్ అరోరా
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
సిగరెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య సమస్యలు ఎన్నో..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

