జమ్ములో మళ్లీ పాకిస్తాన్ కాల్పులు..!
జమ్ములోని ఆర్నియా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం మరమ్మతు పనులు చేస్తున్న భారత జవాన్లపై పాకిస్తాన్ కాల్పులు జరిపింది.

జమ్ము : పాకిస్తాన్ తన వంకర బుద్ధిని ఇంకా మానుకున్నట్లు కనిపించడం లేదు. మరోసారి కాల్పులకు తెగబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ములోని ఆర్నియా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం మరమ్మతు పనులు చేస్తున్న భారత జవాన్లపై పాకిస్తాన్ కాల్పులు జరిపింది. జమ్ము జిల్లా బిష్నాలోని ఆర్నియాలో కాల్పులు జరిపి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది.
బిక్రామ్ పోస్ట్ సమీపంలో మరమ్మతు పనులు చేస్తున్న సరిహద్దు గార్డులపై పాకిస్థాన్‌కు చెందిన చెనాబ్ రేంజర్స్ కాల్పులు జరిపారు. మరమ్మతు పనులు చేస్తున్న జేసీబీకి కొన్ని బుల్లెట్లు తగిలాయి. ఈ కాల్పుల్లో సరిహద్దు గార్డు గాయపడిన సమాచారం సరిహద్దు భద్రతా దళం నిర్ధారించలేదు. ఈ కాల్పులకు సరిహద్దు భద్రతా దళం గట్టి స్పందన ఇవ్వడంతో పాకిస్తాన్ తోక ముడిచింది. పాక్ రేంజర్స్ కాల్పులతో ఈ ప్రాంతంలో గట్టి చర్యలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్ కాల్పుల వల్ల తలెత్తిన పరిస్థితులను తెలుసుకునేందుకు సరిహద్దు భద్రతా దళానికి చెందిన సీనియర్ అధికారులు అరేనాలోని ఐబీని సందర్శించారు.
జమ్ములో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ అనుసరించడం లేదు. సరిహద్దు దాటి అల్లర్లు నిరంతరం కొనసాగిస్తున్నది. సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న సరిహద్దు భద్రతా దళాలపై మే మొదటి వారంలో పాకిస్తాన్ కాల్పులు జరిపింది. మే 19 న సాంబా సెక్టార్‌లోకి కొందరు వ్యక్తులు చొరబడే ప్రయత్నాన్ని సైనికులు అడ్డుకున్నారు. ఈ సమయంలో గాయపడిన ఒక చొరబాటుదారు చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మరణించాడు.
సాంబా సెక్టార్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు పాకిస్తాన్ సైన్యం సహకరిస్తున్నట్లుగా తెలుస్తున్నది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో మూడు చొరబాటు ప్రయత్నాలను భారత జవాన్లు విఫలం చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లోని రీగల్ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా విసిరిన ఆయుధాలను సరిహద్దు దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
వ్యాక్సిన్ వేసుకుంటేనే జీతం చెల్లిస్తాం..
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. చరిత్రలో ఈరోజు
యూట్యూబర్లను పన్ను కిందకు తెచ్చిన అమెరికా
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
గొలుసుల్లో బంధించిన బాల్యం: ఆతృతతో తింటూ ఆరేండ్ల శరణార్థి కన్నుమూత
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

