e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News సైకిల్ స‌వారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వ‌రల్డ్ సైకిల్ డే

సైకిల్ స‌వారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వ‌రల్డ్ సైకిల్ డే

సైకిల్ స‌వారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వ‌రల్డ్ సైకిల్ డే

ఆధునికమైన బైకులు, కార్ల రాక‌తో సైకిళ్ల వాడ‌కం పూర్తిగా త‌గ్గిపోయింది. ప్ర‌స్తుతం పూర్ మ్యాన్స్ బైక్‌గా నిలిచిపోయింది. మ‌న‌లో ఎవ‌రైనా సైకిల్ తొక్కుతూ బ‌య‌ట‌కు వ‌చ్చారంటే చూసిన‌వాళ్లంతా ఎగ‌తాళి చేస్తుంటారు. ఇదే వంక‌తో మ‌నం సైకిల్ తొక్క‌డానికి నామోషీ అవుతుంటాం. ప్ర‌పంచ సైకిల్ దినోత్స‌వం సంద‌ర్భంగా సైకిల్ తొక్క‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయో చూద్దాం.

సైకిళ్ళు అత్యంత సాధ్యమయ్యే పర్యావరణకు అనుకూలమైన రవాణా మార్గంగా. సైక్లింగ్ బరువు తగ్గడానికి సహాయపడటం నుంచి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉన్న‌ది. ముఖ్యంగా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. జిమ్‌కెళ్లి వ్యాయామాలు చేసేంత టైమ్ లేనివాళ్లు సైకిల్‌పై స‌వారీ చేస్తూ ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇంట్లోనే ఓ మూల‌న పెట్టుకుని తొక్కుతూ కూడా చెమ‌ట‌లు క‌క్కేలా వ్యాయామం చేయొచ్చు. సైకిల్ తొక్కుకుంటూ పని ప్రదేశానికి గానీ, పాఠశాలకు లేదా పార్కుకు వెళ్లడం ద్వారా మీ దినచర్యకు ఈ వ్యాయామం సరిపోతుంది. సైక్లింగ్ శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

సైక్లింగ్ చేయ‌డం వ‌ల్ల‌ వేగంగా బరువు తగ్గడంతో పాటు శరీరం ధృడంగా తయారవుతుంది. కొవ్వు, కండరాలు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే దీర్ఘ కాలికంగా వేధిస్తున్న నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. నిమిషం పాటు సైకిల్‌ తొక్కడంతో 12 కేలరీలు ఖర్చువుతుందని నిపుణులు చెప్తున్నారు. అందుక‌ని రోజులో క‌నీసం అర్ధ‌గంట సేపైనా సైకిల్ తొక్క‌డం అల‌వాటుగా చేసుకోవాలి. ఉద‌యం నీరెండ‌లో సైకిల్ తొక్క‌డం వ‌ల‌న అటు వ్యాయామంతో పాటు ఇటు డీ విట‌మిన్ శ‌రీరానికి అంది శ‌రీరం కాంతివంతంగా త‌యార‌వుతుంది.

ఎన్నెన్ని ప్ర‌యోజ‌నాలో..

సైకిల్ స‌వారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వ‌రల్డ్ సైకిల్ డే

ఇంట్లో ఎన్ని బైకులు ఉన్నా.. చిన్నచిన్న ప‌నుల‌కు సైకిల్‌ను వాడ‌టం అల‌వాటు చేసుకోండి.

ఇంటికి ద‌గ్గ‌ర్లోనే ఆఫీస్ ఉంటే ఏంచ‌క్కా సైకిల్‌పై వెళ్లిరండి.

నిత్యం సైకిల్ తొక్క‌డం ద్వారా అడ్రినలిన్, ఎండార్ఫిన్స్‌ విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది.

సైకిల్ తొక్కడం గుండెకు మంచిది. కేలరీలను కరిగించడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోజూ సైకిల్ తొక్క‌డం వ‌ల్ల మెద‌డు శ‌క్తివంతంగా త‌యార‌వుతుంది. చురుగ్గా ఉంటారు.

సైక్లింగ్‌తో యాంటీఏజింగ్ బెనిఫిట్స్ అంది వ‌య‌సులో చిన్న‌వారుగా త‌యార‌వుతారు.

కండ‌రాలు పెంచేందుకు జిమ్‌కు వెళ్ల‌కుండా సైకిల్ తొక్కితే చాలు.

శృంగార స‌మ‌స్య‌ల‌కు కూడా సైక్లింగ్‌తో చెక్ పెట్టొచ్చు.

నడుము నొప్పి, నయాటికా, స్పాండీ లైటీస్‌ వంటి వెన్నెముకకు సంబంధ ఇబ్బందులు తొలగుతాయి.

కీళ్ల మ‌ధ్య ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డి వాటి మ‌ధ్య ఉన్న లాస్తి బ‌ల‌ప‌డుతుంది.

స్వేద‌రంద్రాలు తెరుచుకుని చ‌ర్మంపై మృత‌క‌ణాలు తొలిగిపోయి ఆరోగ్యంగా ఉంటారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

భార‌త్ నుంచి పాకిస్తాన్ విభ‌జ‌న‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

అమ్మాయిల‌కు మెడిసిన్‌, ఇంజినీరింగ్‌లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లు

అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం

అంగార‌కుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవ‌ర్ ఫొటోలు

క‌రోనా వేళ అన్నదాత‌లుగా మారిన‌ యాసిడ్ బాధితులు..

కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వ‌రులు.. ఎందుకిలా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సైకిల్ స‌వారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వ‌రల్డ్ సైకిల్ డే

ట్రెండింగ్‌

Advertisement