Job notifications | వెంటనే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలి..నిరుద్యోగుల పోరాటానికి అండగా ఉంటాం: రాకేశ్‌రెడ్డి
వెంటనే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే లక్ష మందితో సచివాలయం, సీఎం ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి అన్నారు.
- నిరుద్యోగుల పోరాటానికి అండగా ఉంటాం: రాకేశ్‌రెడ్డి
ఎల్బీనగర్, మే 26 (నమస్తే తెలంగాణ): వెంటనే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే లక్ష మందితో సచివాలయం, సీఎం ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలని కోరుతూ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల హక్కుల పోరాట వేదిక నాయకుడు ఇంద్రానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు ఉద్యోగం పొందేవరకు బీఆర్ఎస్ పోరాటం సాగిస్తుందని అన్నారు. కోర్టు మెట్లు ఎక్కించినా నిరుద్యోగులు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా వారికి అండగా ఉంటామని తెలిపారు. రేపు, మాపు అంటూ నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులుకు గురి చేయవద్దని సూచించారు.
నిరుద్యోగుల హక్కుల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 30న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ సభ నిర్వహించబోతున్నట్టు తెలిపారు. నిరుద్యోగుల వయోపరిమితికి జూన్ 1 కాకుండా, జనవరి 1 కట్ ఆఫ్ డేట్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నవీన్ పట్నాయక్, శంకర్, ఆకాశ్, శింబునాయక్, కుమార్, బాలకోటి, అశోక్, సందీప్, సోమేశ్, రవికిరణ్ , వంశీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

