హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. 2026-27 విద్యాసంవత్సరానికి పలు కోర్సుల్లో అడ్మషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నది. దీంతో ఫీజుల చె ల్లింపు అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రు ల్లో ఆందోళన నెలకొన్నది. ఇప్పటికే జీవో ను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సం ఘాలు డిమాండ్ చేస్తుండగా, సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కాలే జీ ట్యూషన్, మెయింటెనెన్స్ ఫీజులను ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విడుదల చేస్తున్నది.
2009 నుంచి అమలు చేస్తున్న మార్గదర్శకాలకు విరుద్ధంగా తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసిం ది. జీవో7ను గత నెల విడుదల చేసింది. ఇప్పటివరకు స్కీమ్‌కు సంబంధించి నిధులను కాలేజీ యాజమాన్యాలకే ప్ర భుత్వం చెల్లిస్తుండగా, ఈ విద్యాసంవత్సరం నుంచి అర్హులైన విద్యార్థుల ఖాతాల్లోనే డీబీటీ విధానంలో చెల్లించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవాలనే నిబంధన విధించింది. ప్రభుత్వ షరతులను కాలేజీ యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. జీవో-7లోని ఆ నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు ఎప్పుడు చెల్లిస్తారనేదానిపై సమగ్రమైన కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్‌ను ఇటీవల ఆదేశించింది.