హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): భారతీయ ప్రవాసు లు అంతా కలిసి సాంస్కృతిక ఐ క్యతను చాటేలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మలేషియా లో నిర్వహిస్తామని బీఆర్ఎస్ ఎ న్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగా ల తెలిపారు. మంగళవారం ఆయన మ లేషియా తెలుగు అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలేషియాలో అట్టహాసంగా నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకులకు మలేషియా తెలుగు అకాడమీ మద్దతు ప్రకటించిందని వెల్లడించారు.
తెలుగు ఎక్స్పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (టీఈఏఎం), మలేషియా ఆంధ్ర అసోసియేషన్(ఎంఏఏ), మలేషియా తెలుగు ఫౌండేషన్ (ఎంటీఎఫ్), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా (టీఏఎం), తమిళ్ ఎక్స్పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (టీఈఎం), మలయాళీ కుటుంబం (ఎంఏకేఏఎస్ఏ), కన్నడ అసోసియేషన్ ఆఫ్ మలేషియా, పంజాబీ అసోసియేషన్ ఆఫ్ మలేషియా, ఒడిశా అసోసియేషన్ ఆఫ్ మలేషియా, భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (బీఏఎం) మద్దతు ప్రకటించాయని మహేశ్ బిగాల తెలిపారు. జూన్ 6న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు.