నాంపల్లి క్రిమినల్ కోర్టులు, అగస్టు 17 (నమస్తే తెలంగాణ): సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 11వ నిందితుడిగా ఉన్న ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ సోమవారం వర్చువల్ పద్ధతిలో కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు సీసీ ఫుటేజీకి సంబంధించిన సీడీని, దర్యాప్తు పత్రాలను అల్లు అర్జున్‌కు ఇవ్వలేదని ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టుకు తెలియజేశారు.
వచ్చే వాయిదానాటికి సీడీ, కేసు పత్రాలను అందజేస్తామని పోలీసులు బదులివ్వడంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు.