కొండగట్టులో బస్సు లారీ ఢీ.. 25 మందికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం
జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారి కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. మల్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం కొండగట్టుకు సమీపంలో ఎస్‌క్రాస్ మూలమలుపు వద్ద కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న కరీంగనర్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.
- జగిత్యాల దవాఖానకు తరలింపు
మల్యాల, ఆగస్టు 17 : జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారి కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. మల్యాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం కొండగట్టుకు సమీపంలో ఎస్‌క్రాస్ మూలమలుపు వద్ద కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న కరీంగనర్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
మల్యాల సీఐ రాజ్‌కుమార్, మల్యాల, కొడిమ్యాల ఎస్సైలు సౌడం సందీప్, అనుమండ్ల నరేశ్‌కుమార్, మల్యాల తహసీల్దార్ గడ్డమీది శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని 25 మంది క్షతగాత్రులను అంబులెన్స్‌లో జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు. వారిలో మహ్మద్ మునీర్ పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ గుండారపు మురళి బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోగా స్థానికులు బయటకి తీశారు. లారీ డ్రైవర్ జాజిబాబుకు గాయాలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

