Nani | జడల్ గెటప్‌లో నాని సినిమాకు యంగ్ హీరో.. తన మూవీకి కూడా అదిరిపోయే ప్రమోషన్!
Nani | నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ఒక రోజు ముందుగానే ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా నిర్వహించారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’, నాని పోషించిన జడల్ పాత్ర గురించే చర్చ జరుగుతోంది.
Nani | నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ఒక రోజు ముందుగానే ప్రత్యేక ప్రీమియర్ షోలు కూడా నిర్వహించారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’, నాని పోషించిన జడల్ పాత్ర గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హర్ష్ రోషన్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను చూసేందుకు హర్ష్ రోషన్ హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌కు వెళ్లాడు. అయితే సాధారణంగా వెళ్లకుండా.. సినిమాలో నాని కనిపించిన జడల్ గెటప్‌ను పోలిన లుక్‌లో థియేటర్‌కు రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. జడల్ తరహా హెయిర్‌స్టైల్, గెటప్‌తో హర్ష్ రోషన్ థియేటర్‌కు రావడంతో అక్కడ ఉన్న ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది.
హర్ష్ రోషన్ జడల్ గెటప్‌లో థియేటర్‌కు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నానిపై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్న హర్ష్ రోషన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇందులో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ప్రస్తుతం హర్ష్ రోషన్ ‘తెల్ల కాగితం’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇదే సమయంలో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌కు జడల్ గెటప్‌లో వచ్చిన హర్ష్ రోషన్ తన వెనుక భాగంలో ఉన్న షర్ట్‌పై ‘తెల్ల కాగితం.. అక్టోబర్ 2 రిలీజ్’ అనే విషయాన్ని ప్రదర్శించాడు.
దీంతో ఒకే సందర్భంలో నానిపై తన అభిమానాన్ని చాటుకోవడంతో పాటు తన రాబోయే సినిమాకు కూడా ప్రచారం కల్పించినట్టైంది. ఈ ఆలోచనపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన కామెంట్లు వస్తున్నాయి. నాని జడల్ గెటప్‌ను అనుసరించడం అభిమానాన్ని చూపిస్తే.. షర్ట్‌పై తన సినిమా విడుదల తేదీని చూపించడం మంచి ప్రచార ఆలోచనగా పలువురు అభిప్రాయపడుతున్నారు. హర్ష్ రోషన్‌కు సినీ పరిశ్రమతో చిన్ననాటి నుంచే అనుబంధం ఉంది. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. నాని నిర్మించిన ‘కోర్ట్’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా ‘బ్యాండ్ మేళం’ చిత్రంలో నటించాడు. ఇప్పుడు ‘తెల్ల కాగితం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యూత్ ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ‘తెల్ల కాగితం’పై యువ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 2న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హర్ష్ రోషన్ చేస్తున్న ప్రచారం కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Hero #Roshan Watched #Paradise Premeries At Sree Rampulu Theatre ! 💥💥💥
Jadal Jamana Shuru.. #ThellaKaagitham pic.twitter.com/9QUhzWWEBr
— భరత్ 🔱 (@BKPawanist) September 24, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

