Road Accident | తమ్ముడి పెళ్లికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. అన్న సహా ముగ్గురు దుర్మరణం.. వదిన, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!
Road Accident | తమ్ముడి పెళ్లి కోసం భార్య, స్నేహితులతో స్వగ్రామానికి వెళ్లిన వ్యక్తిని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం (Road Accident) రూపంలో మృత్యువు కబలించింది. అతడితోపాటు అతని ఇద్దరు స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. భార్య మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident : తమ్ముడి పెళ్లి కోసం భార్య, స్నేహితులతో స్వగ్రామానికి వెళ్లిన వ్యక్తిని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం (Road Accident) రూపంలో మృత్యువు కబలించింది. అతడితోపాటు అతని ఇద్దరు స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. భార్య మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం పెరంబలూర్ జిల్లా (Perambalur district) లోని తురాయ్మంగళం (Thurai Mangalam) గ్రామానికి సమీపంలో తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారి (Trichi-Chennai National Highway) పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రామనాథపురం జిల్లా ముడుకులతూర్ తాలూకా ఒరియవాయల్ గ్రామానికి చెందిన కార్తి (38) చెన్నైలో భార్య సూర్యతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తన తమ్ముడి వివాహం కోసం భార్య, స్నేహితులతో కలిసి కారులో స్వగ్రామానికి వచ్చాడు. వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం గురువారం తెల్లవారుజామున భార్య, స్నేహితులతో కలిసి చెన్నైకి తిరుగు ప్రయాణమయ్యాడు. కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్తూ ముందు వెళ్తున్న ఓమ్ని బస్సును ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో కార్తి స్నేహితులు కాజా అలియాస్ కాళీశ్వరం, ప్రభాకరన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన కార్తీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కార్తీ భార్య సూర్య, కారు డ్రైవర్ కాళిదాసన్, జాన్ కెన్నడీ, శరణ్యలకు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సూర్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుచిరాపల్లి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెరంబలూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

