సోమరిపోతు ఏనుగు.. నవ్వు తెప్పిస్తోంది..! వీడియో వైరల్
ఒక ఏనుగు కెన్యాలోని అనాధ శిబిరంలో తన సోమరితనంతో నీళ్లు తాగుతూ.. వావ్ వాటే లేజీ ఎలీఫెంట్..! అని అనుకునేలా చేస్తున్నది.

శిక్షణ పొందిన జంతువులు మనం చెప్పినట్లు నడుచుకుంటుంటాయి. అందునా కుక్కలు, గుర్రాలు, ఏనుగులు మరింత బాగా పనిచేస్తుంటాయి. మనం ఏం చెప్పినా ఇట్టే పట్టేస్తుంటాయి. అయితే, కొన్ని సోమరితనంతో ఉన్న ఏనుగులు వాటి చేష్ఠలతో మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి ఒక ఏనుగు కెన్యాలోని అనాధ శిబిరంలో తన సోమరితనంతో నీళ్లు తాగుతూ.. వావ్ వాటే లేజీ ఎలీఫెంట్..! అని అనుకునేలా చేస్తున్నది.
షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ కెన్యాలో అనాధ ఏనుగుల రక్షణ, వన్యప్రాణుల పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. వీరి ఆలనలో పలు జంతువులు రక్షణ పొందుతున్నాయి. అయితే, ఈ పునరావాస కేంద్రంలో ఉన్న లెమెకి అనే గున్న ఏనుగు ఒకటి నీరు తాగేందుకు కూడా ఎంత సోమరితనం ప్రదర్శిస్తుందో చూసేవాళ్లకు నవ్వు తెప్పిస్తున్నది. అక్కడ పనులు చేస్తున్న ప్రాంతంలోని నీటి పైపును తొండంతో లేపి నోట్లో దోపుకుని నీళ్లు తాగుతుంది. కనీసం పైపును తొండంతో పట్టుకోవడానికి కూడా ఈ ఏనుగుకు బద్ధకం. కింద పడుతున్న ప్రతిసారీ పైపును తొండంతో నోట్లోకి దోపుకుంటోంది కానీ తొండం సాయం మాత్రం తీసుకోవడం లేదు.
ఈ సోమరిపోతు ఏనుగు వీడియోను షెల్డ్రిక్ వైల్డ్‌లైప్ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఒక్క రోజులోనే వేలల్లో లైక్‌లు వచ్చాయి. మరెంతో మంది రీట్వీట్ చేశారు. ఈ వీడియోను చూస్తూ పలువురు నెటిజెన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.. ఒకరేమో.. లేజీ ఎలీఫెంట్ కాదు.. ఇంటెలీజెంట్ ఎలీఫెంట్.. అని, క్లెవర్ గర్ల్ అని.. కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
ఫ్రెంచ్ ఓపెన్ : కరోనాతో డబుల్స్ ఆటగాళ్ళు అవుట్
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

