Telangana
- Nov 23, 2020 , 22:26:10
వెల్లివిరిసిన కార్తీకశోభ

వేములవాడ కల్చరల్: కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉదయం స్వామివారికి ప్రాతఃకాలపూజల అనంతరం ఉదయం నుండే భక్తులు కోడెమొక్కు చెల్లించుకునేందుకు క్యూలైన్లో నిలబడి టిక్కెట్లు తీసుకున్నారు. స్వామివారి దర్శనం కోసం వేకువ జాముననే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. భౌతికదూరం పాటిస్తూ, మాస్క్ ధరించి ఆలయం లోపలికి ప్రవేశించారు.
ఆలయ కళాభవన్లో 84 మంది దంపతులు కల్యాణ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో చండీహోమాలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. స్వామి వారిని 40 వేల మందికి పైగా భక్తులకు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఆలయ ఏఈవో సంకెపల్లి హరికిషన్, పర్యవేక్షకులు శ్రీరాములు, మహేశ్, ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, భూపతిరెడ్డి ఏర్పాట్లు చేశారు.
తాజావార్తలు
- వారణాసిలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ టూర్
- మెగా హీరోల మూవీ రిలీజ్ డేట్స్ వచ్చేశాయి..!
- ఢిల్లీలో స్వల్ప భూకంపం.. 2.8 తీవ్రత
- ఆ రెండు రాష్ట్రాల్లోనే 70 శాతం కరోనా కేసులు
- పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ ఎంతో తెలుసా?
- సలార్ కథానాయికని ప్రకటించిన చిత్ర బృందం
- తమిళనాడులో దొంగల బీభత్సం : 17 కేజీల బంగారం చోరీ
- రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య
- గుంత కనిపిస్తే..అధికారులకు జీహెచ్ ఎంసీ కమిషనర్ సీరియస్ వార్నింగ్
- మొసలితో పరాచకాలు..అరెస్ట్ చేసిన పోలీసులు
MOST READ
TRENDING