కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
యూరప్ నుంచి బయల్దేరిన నావికుడు వాస్కోడిగామా 1498 లో సరిగ్గా ఇదే రోజున భారతదేశానికి చెందిన కాలికట్కు చేరుకున్నారు

యూరప్ నుంచి బయల్దేరిన నావికుడు వాస్కోడిగామా 1498 లో సరిగ్గా ఇదే రోజున భారతదేశానికి చెందిన కాలికట్కు చేరుకున్నారు. ఈ యాత్ర పూర్తి చేసి ఇండియాను కనిపెట్టేందుకు వాస్కోడిగామాకు 10 నెలల సమయం పట్టిందంట.
పోర్చుగల్‌కు చెందిన యువ నావికుడు వాస్కోడిగామా తన మొదటి సముద్రయానంలో దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత జూలై 1497 లో భారతదేశాన్ని వెతకడానికి బయలుదేరాడు. పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తొలుత దక్షిణాఫ్రికా చేరుకున్న వాస్కోడిగామా.. అక్కడి నుంచి మొజాంబిక్ చేరుకుని కొన్ని రోజుల పాటు తన ప్రయాణాన్ని నిలిపివేశారు. అక్కడి సుల్తాన్‌కు యురోపియన్ బహుమతులు ఇవ్వడంతో సంతోషించిన ఆయన.. ఇండియాకు వెళ్లేందుకు వాస్కోడిగామాకు ఎంతో సహాయం చేశాడు.
చివరికు 1948 మే 20 న వాస్కోడిగామా దాదాపు 10 నెలల ప్రయాణం తరువాత కాలికట్ తీరానికి చేరుకున్నారు. కాలికట్లో మూడు నెలలు గడిపిన తరువాత పోర్చుగల్‌కు తిరిగి వెళ్లాడు. తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అతడి వెంట 199 మంది నావికులు ఉండగా.. తిరుగు ప్రయాణంలో కేవలం 55 మందే ఉన్నారు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2011: మధ్యప్రదేశ్ బినా వద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్
2011: కామన్వెల్త్ కుంభకోణంలో మొదటి చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
2002: స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తూర్పు తైమూర్
2001: ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రెస్ కోడ్ రూపొందించిన తాలిబాన్లు
1995: మానవరహిత అంతరిక్ష నౌక ‘స్పెక్ట్రా’ ను విజయవంతంగా ప్రయోగించిన రష్యా
1990: అంతరిక్షం నుండి మొదటి చిత్రాలను పంపిన హబుల్ స్పేస్ టెలిస్కోప్
1932: విప్లవాత్మక ఆలోచనల పితామహుడు విపిన్ చంద్ర పాల్ మరణం
1902: అమెరికా నుంచి స్వాతంత్ర్యం పొందిన క్యూబా
1900: ప్రసిద్ధ కవి సుమిత్రానందన్ పంత్ జననం
1873: తొలి జీన్స్ తయారీకి పేటెంట్ పొందిన శాన్ఫ్రాన్సిస్కో వ్యాపారవేత్త లెవి స్ట్రాస్, దర్జీ జాకబ్ డేవిస్
1784: పారిస్ ఒప్పందం ప్రకారం ఆక్రమిత ప్రదేశాలను బ్రిటన్, భారతదేశం, ఇండోనేషియాకు ఇచ్చిన నెదర్లాండ్స్
1609: విలియం షేక్స్పియర్ తొలి కవితా సంకలనం ప్రచురణ
ఇవి కూడా చదవండి..
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్‌లాక్ : కలకలలాడుతున్న ఎయిర్‌పోర్ట్స్, రెస్టారెంట్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

