e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News మ‌రో చిప్కో ఉద్య‌మం.. ఎంపీలో 'సేవ్ బక్స్వాహా ఫారెస్ట్'

మ‌రో చిప్కో ఉద్య‌మం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’

మ‌రో చిప్కో ఉద్య‌మం.. ఎంపీలో 'సేవ్ బక్స్వాహా ఫారెస్ట్'

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో చిప్కో ఉద్య‌మం ప్రారంభ‌మైంది. సేవ్ బ‌క్స్వాహా ఫారెస్ట్ పేరుతో ఉద్యమం ఊపందుకున్న‌ది. ఛ‌తార్‌పూర్‌లోని బ‌క్స్వాహా అట‌వీ ప్రాంతం వ‌జ్రాల గ‌నుల‌కు ప్ర‌సిద్ధి. ఇక్క‌డి మొక్క‌ల‌ను న‌రికివేయ‌డం ద్వారా వ‌జ్రాల వెలికితీత సుల‌భం అవుతుంద‌ని ప్ర‌భుత్వాలు భావిస్తుండ‌గా.. ప‌ర్యావ‌ర‌ణం మొత్తం నాశ‌న‌మవుతుంద‌ని ప్ర‌జ‌లు, ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

బక్స్వాహా వజ్రాల గని కోసం 2.15 ల‌క్ష‌ల చెట్ల‌ను నరికివేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా 1.12 ల‌క్ష‌ల‌ మంది అడ‌వికి చేరుకుని చెట్ల‌ను కౌగిలించుకున్నారు. వీరంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘సేవ్ బాక్స్వాహా ఫారెస్ట్’ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా ఇన్‌ఫెక్షన్ నిలిచిపోయిన త‌ర్వాత ఈ ఉద్య‌మాన్ని మ‌రింత ఉధృతం చేసేందుకు ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. అవసరమైతే చెట్లకు అంటిపెట్టుకుని ఉండి నిర‌శ‌న దీక్ష‌లు చేసేలా దేశ‌వ్యాప్తంగా 50 సంస్థలు దీని కోసం ఒక వ్యూహాన్ని రూపొందించాయి. ఇదిలావుండగా ఢిల్లీకి చెందిన నేహా సింగ్ దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రస్తుతం, బ‌క్స్వాహా అట‌వి మధ్యలో ఉన్న‌ అట్కా ప్రాజెక్ట్ డైమండ్ గని కోసం 62.64 హెక్టార్ల అడవిని అధికారులు గుర్తించారు. 40 హెక్టార్లకు పైగా మైనింగ్ కోసం ఒక ప్రాజెక్ట్ ఉంటే.. అప్పుడు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ దీనిని ఆమోదిస్తుంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపినా, ఇంకా ఆమోదం పొందలేదని అటవీ శాఖ భూ నిర్వహణ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సునీల్ అగర్వాల్ చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

బ్రిటన్ అన్‌లాక్ : క‌ల‌క‌ల‌లాడుతున్న‌ ఎయిర్‌పోర్ట్స్‌, రెస్టారెంట్స్

పిల్లలపై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిలిపివేయాల‌న్న పిటిష‌న్ తోసివేత‌

న‌టి మెర్కెల్‌ను వివాహ‌మాడిన ప్రిన్స్‌ హ్యారీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

బ‌ట్ల‌ర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ XI లో ధోనీ, కోహ్లీ, శ‌ర్మ‌కు చోటు

కోడి మెద‌ళ్లు తిన్నా.. 111 ఏండ్లు బ‌తికున్నా..!

క‌న్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ క‌నిపెట్టిండు..!

బైడెన్ క‌న్నా క‌మ‌లా సంపాద‌న ఎక్కువ‌.. ఎంత ప‌న్ను చెల్లిస్తున్నారంటే..?!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌రో చిప్కో ఉద్య‌మం.. ఎంపీలో 'సేవ్ బక్స్వాహా ఫారెస్ట్'

ట్రెండింగ్‌

Advertisement