నటి మెర్కెల్‌ను వివాహమాడిన ప్రిన్స్ హ్యారీ.. చరిత్రలో ఈరోజు
అమెరికాకు చెందిన నటి, కాలిఫోర్నియాలో నివసించే మేగాన్ మెర్కెల్‌ను బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ 2018 సరిగ్గా ఇదే రోజున వివాహమాడారు

అమెరికాకు చెందిన నటి, కాలిఫోర్నియాలో నివసించే మేగాన్ మెర్కెల్‌ను బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ 2018 సరిగ్గా ఇదే రోజున వివాహమాడారు. వీరి వివాహం బ్రిటన్‌లోని విండ్సర్ సెయింట్ జార్జ్ చాపెల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పెండ్లి జరగ్గానే డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ సస్సెక్స్ అనే బిరుదును మెర్కెల్, హ్యారీలకు రాణి అందజేసి బ్రిటన్ రాజ సంప్రదాయాన్ని కొనసాగించారు.
వీరిద్దరూ 2016 నుంచి ప్రేమలో ఉన్నట్లు చెప్తారు. ఈ పుకార్లను పటాపంచలు చేస్తూ 2017 నవంబర్ లో ప్రిన్స్ హ్యారీ, మేగాన్ మెర్కెల్ నిశ్చితార్థాన్ని ప్రకటిస్తూ ప్రిన్స్ చార్లెస్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 లో వీరి వివాహం కాగా, 2019 మే 6 న, ఆర్చీ అనే బిడ్డకు మేగాన్ మెర్కెల్ జన్మనిచ్చింది.
అక్టోబర్ 2019 లో రాజకుటుంబానికి, ఈ ఇద్దరి మధ్య అంతగా పొసగడం లేదని వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. మీడియా ఊహాగానాలు చివరకు సరైనవని తేలుతూ.. 2020 జనవరి 9 న రాజకుటుంబం నుంచి విడిపోతున్నట్లు ప్రిన్స్ హ్యారీ, మెర్కెల్ దంపతులు ప్రకటించారు. ఈ సమాచారాన్ని వీరు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ‘చాలా నెలల ఆలోచన తర్వాత.. చివరికి రాజ కుటుంబానికి చెందిన సీనియర్ సభ్యుల పదవిని వీడుతున్నామని, ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి కృషి చేస్తామని నిర్ణయించుకున్నాం’ అని ప్రకటించారు. అప్పుడే ఈ జంట’ రాయల్ హైనెస్ ‘బిరుదును, రాయల్ ఫ్యామిలీ అన్ని సౌకర్యాలను విడిచిపెట్టి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు.
కాగా, గత మార్చి నెలలో ప్రసిద్ధ టీవీ షో నిర్వహించే ఓప్రా విన్ఫ్రేకి ఇచ్చి ఇంటర్వ్యూలో వీరు రాజకుటుంబంలో తానెదుర్కొన్న సమస్యలను ఏకరవు పెట్టారు. తమకు పుట్టబోయే బిడ్డ రంగు గురించి కూడా చర్చించారని మెర్కెల్ చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే లేపాయి. చివరకు రాజకుటుంబం ఈ విషయంలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2018: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రెండు రోజులకే యడ్యూరప్ప రాజీనామా
2004 : భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్సింగ్ ప్రమాణం
2001 : వర్జీనియాలో తొలి యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన స్టీవ్ జాబ్స్
1979: హిందీ రచయిత హజారీ ప్రసాద్ ద్వివేది మరణం
1950: సూయజ్ కాలువను ఇజ్రాయెల్‌కు మూసివేసిన ఈజిప్ట్
1934: ఆంగ్ల భాషా భారతీయ రచయితలలో ఒకరైన ‘రస్కిన్ బాండ్‌స జననం
1913: భారత ఆరో రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి జననం
1904: టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా మరణం
1892: స్వలింగ సంపర్క నేరానికి రెండేండ్ల జైలు శిఖ అనుభవించి విడుదలైన రచయిత, కవి ఆస్కార్ వైల్డ్
ఇవి కూడా చదవండి..
బట్లర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ XI లో ధోనీ, కోహ్లీ, శర్మకు చోటు
కోడి మెదళ్లు తిన్నా.. 111 ఏండ్లు బతికున్నా..!
కన్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ కనిపెట్టిండు..!
ఓలి ప్రమాణ స్వీకారంపై వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ
బైడెన్ కన్నా కమలా సంపాదన ఎక్కువ.. ఎంత పన్ను చెల్లిస్తున్నారంటే..?!
వచ్చే నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

