బైడెన్ కన్నా కమలా సంపాదన ఎక్కువ.. ఎంత పన్ను చెల్లిస్తున్నారంటే..?!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతని భార్య జిల్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె భర్త డగ్లస్ తమ 2020 ఆదాయ, రాబడులను ప్రకటించారు. వీరందించిన గణాంకాల ప్రకారం, బైడెన్ ఆదాయంలో రెండున్నర రెట్లు ఎక్కువగా కమలా హారిస్ సంపాదిస్తున్నారు. బైడెన్ కంటే ఎక్కువ పన్ను చెల్లిస్తున్నారు.

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతని భార్య జిల్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె భర్త డగ్లస్ తమ 2020 ఆదాయ, వ్యయాలను ప్రకటించారు. వీరందించిన గణాంకాల ప్రకారం, బైడెన్ ఆదాయంలో రెండున్నర రెట్లు ఎక్కువగా కమలా హారిస్ సంపాదిస్తున్నారు. బైడెన్ కంటే కమలా ఎక్కువ పన్ను చెల్లిస్తున్నారు.
వైట్ హౌస్ ప్రకారం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతడి భార్య జిల్ 2020 లో ఆరు లక్షల ఏడు వేల డాలర్లు (దాదాపు రూ.4.30 కోట్లు) సంపాదించారు. 2019 లో ఈ జంట ఆదాయం 9 లక్షల 85 వేల డాలర్లు (దాదాపు రూ. 7.18 కోట్లు). 2019 తో పోల్చితే వారి ఆదాయం గత సంవత్సరం తగ్గింది. అతను తన ఆదాయంపై 25.9 శాతం పన్ను చెల్లిస్తున్నారు.
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె భర్త డగ్లస్ అమ్హాఫ్ 2020 లో దాదాపు 1.7 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.38 కోట్లు) ఆదాయాన్ని పొందారు. ఈ జంట ఆరు లక్షల 21 వేల డాలర్ల పన్నును ప్రభుత్వానికి చెల్లించారు. వీరి పన్ను రేటు 36.7 శాతం. కమలా హారిస్ అమెరికా అధ్యక్షుడు, అతని భార్య సంపాదించిన దానికంటే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు. కమలా హారిస్ కాలిఫోర్నియాలో 1.25 మిలియన్ డాలర్ల పన్నును, ఆమె భర్త కొలంబియాలో 56 వేల డాలర్ల పన్నును చెల్లించారు. 2020 లో ఆయన 27 వేల డాలర్లు విరాళంగా ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు, ఆయన భార్య కూడా 30 వేల డాలర్ల విరాళాలు ఇచ్చారు. అంటే, తన ఆదాయంలో 5.1 శాతం విరాళంగా ఇచ్చాడు. యూఎస్ చట్టం ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వారి ఆర్థిక సమాచారాన్ని బహిరంగపరచాలి. దాంతో ఇద్దరి ఆదాయ, వ్యయాలు వైట్ హౌస్ నుంచి బహిరంగపరిచారు.
ఇవి కూడా చదవండి..
టీకా దౌత్యానికి భారత్, దక్షిణాఫ్రికాకు చైనా మద్దతు
ఇక న్యూయార్క్లో దీపావళి సెలవుదినం..?
వచ్చే నవంబర్లో బంగ్లాదేశ్లో టీమిండియా పర్యటన
ముగిసిన ఎల్టీటీఈ శకం.. చరిత్రలో ఈరోజు
నితీష్జీ.. నా కోసం పెండ్లిళ్లపై నిషేధం విధించరూ..?!
కరోనా ముప్పు దృష్ట్యా పాఠశాలల మూసివేతకు నిర్ణయం
అధిక రక్తపోటు.. చేయాల్సినవి.. చేయకూడనివి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

