e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ముగిసిన ఎల్‌టీటీఈ శ‌కం.. చ‌రిత్ర‌లో ఈరోజు

ముగిసిన ఎల్‌టీటీఈ శ‌కం.. చ‌రిత్ర‌లో ఈరోజు

ముగిసిన ఎల్‌టీటీఈ శ‌కం.. చ‌రిత్ర‌లో ఈరోజు

శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలం కోసం శ్రీలంక ప్రభుత్వంతో పోరు సాగించిన ఉగ్ర‌వాద సంస్థ‌ లిబ‌రేష‌న్ టైగ‌ర్స్ ఆఫ్ త‌మిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) 2009 లో స‌రిగ్గా ఇదే రోజున అంత‌మైంది. వేలుపిళ్లై ప్ర‌భాక‌ర‌న్ నేతృత్వంలో త‌మిళ ఈలం కోసం ఎల్‌టీటీఈ ఎంతో పోరాడింది.

1975లో జాఫ్నా నగర మేయర్ హత్యకు గురయ్యారు. మరో సంవత్సరం గడిచాక ప్రభాకరన్ బృందం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)గా పేరు మార్చుకుంది. దాదాపు పది వేల మంది సైన్యంతో బలీయమైన శక్తిగా తమిళ్ టైగర్స్ అవతరించింది. మహిళలు, చిన్నారులు కూడా ఈ దళంలో సభ్యులుగా ఉండేవారు. ఇక అప్ప‌టి నుంచి ప్ర‌త్యేక త‌మిళ ఈలం ఏర్పాటు ల‌క్ష్యంగా శ్రీ‌లంక ప్ర‌భుత్వంపై పోరాడారు. 1976 లో విల్లికాడేలో ఊచకోత ద్వారా హింసాత్మక, బలమైన ఉనికిని ప్ర‌పంచానికి చాటింది. సంస్థ క్రమంగా తన పట్టును పెంచుకుంటూ పోతూ.. శ్రీలంక నాయకులను అనేకసార్లు లక్ష్యంగా చేసుకున్న‌ది.

1980 ల తర్వాత ఈ సంస్థకు ఇతర దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. క్ర‌మంగా దాని బలం పెరగడం ప్రారంభమైంది. 1985 లో శ్రీలంక ప్రభుత్వం, తమిళ తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చల కోసం మొదటి ప్రయత్నం జరిగింది. అయితే, అది ఎందుకో విఫలమైంది. దీని త‌ర్వాత‌ శ్రీలంకలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు ఏర్ప‌డ్డాయి.

1987 లో ఎల్‌టీటీఈని అంత‌మొందించేందుకు భారత్ తన దళాలను శ్రీ‌లంక‌ కూడా పంపింది. భారతదేశం తీసుకున్న ఈ చర్యతో ఎల్‌టీటీఈ.. భారతదేశానికి వ్యతిరేకంగా మారి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. రాజీవ్ గాంధీ హత్యతో వారు ఈవిధంగా ప్రతీకారం తీర్చుకున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం 1991 లో త‌మిళ‌నాడుకు వ‌చ్చిన అప్ప‌టి ప్ర‌ధాని రాజీవ్‌గాంధీని శ్రీ‌పెరంబుదూర్‌లో బెల్టు బాంబు పేల్చి హ‌త‌మార్చారు.

ప్రవాస తమిళుల నుంచి వచ్చే నిధులతో ఎల్‌టీటీఈ ఆయుధ సంపత్తి సమృద్ధిగా ఉండేది. భారత్‌లో ఉన్న సానుభూతిపరుల నుంచి కూడా ఆ సంస్థకు నిధులు అందేవని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. శ్రీలంక సైన్యం దాడులకు వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది పొరుగు దేశాలకు పారిపోయారు. ఎక్కువశాతం శ్రీలంక తమిళులు తమిళనాడుకు చేరుకుని నేటికీ శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్నారు. ప్రభాకరన్‌ను మట్టుపెట్టడం ద్వారా శ్రీలంక ప్రభుత్వం 2009లో ఈ పోరుకు ముగింపు పలికింది.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2017: హిందీ సినీ నటి రీమా లగూ కన్నుమూత‌

2008: గాయ‌కుడు నితిన్ ముఖేష్‌కు జాతీయ లతా మంగేష్కర్ అలకరన్‌ను ప్రదానం చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం

1994: గాజా స్ట్రిప్ ప్రాంతం నుంచి చివరి ఇజ్రాయెల్ దళాలను తొలగించడంతో అమ‌లులోకి వ‌చ్చిన పాలస్తీనా స్వయంప్రతిపత్తి పాలన

1991: అంత‌రిక్షంలోకి బ‌య‌ల్దేరిన తొలి బ్రిటన్ వ్యోమగామి హెలెన్ షెర్మాన్

1974 : పోఖ్రాన్‌లో విజ‌య‌వంతంగా అణుప‌రీక్ష‌లు నిర్వ‌హించిన భార‌త‌దేశం

1933: భారత 12 వ ప్రధాని హెచ్డి దేవెగౌడ జననం

1912: మొట్టమొదటి భారతీయ చలన చిత్ర నిడివి శ్రీ పుండాలిక్ విడుదల‌

1848: జర్మనీలో మొదటి జాతీయ అసెంబ్లీ ప్రారంభం

ఇవి కూడా చ‌ద‌వండి..

నితీష్‌జీ.. నా కోసం పెండ్లిళ్ల‌పై నిషేధం విధించ‌రూ..?!

క‌రోనా ముప్పు దృష్ట్యా పాఠ‌శాల‌ల మూసివేత‌కు నిర్ణ‌యం

ప్ర‌యాణ ప‌రిమితుల‌ను తొల‌గించిన సౌదీ అరేబియా

వ‌చ్చే ఏడాదిక‌ల్లా మార్కెట్లోకి హీరో ఎల‌క్ట్రిక్ బైక్‌

అధిక ర‌క్త‌పోటు.. చేయాల్సిన‌వి.. చేయ‌కూడ‌నివి

శ్రీలంక క్రికెట్‌లో వివాదం: ఆట‌గాళ్ల జీతాల్లో 35 శాతం కోత‌

భ‌ద్రంగా అజ్మీర్‌లోని ఇజ్రాయెల్ మందిరం

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముగిసిన ఎల్‌టీటీఈ శ‌కం.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement