శ్రీలంక క్రికెట్లో వివాదం: ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత
శ్రీలంక క్రికెట్లో జీతాల వివాదం ముదిరి పాకాన పడింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది

కొలంబో : శ్రీలంక క్రికెట్లో జీతాల వివాదం ముదిరి పాకాన పడింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దాంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్ సహా సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
శ్రీలంక క్రికెట్లో జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. కొద్ది రోజుల క్రితం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) క్రీడాకారుల జీతం 35 శాతం తగ్గించాలని నిర్ణయించింది. కొత్త ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలుగా ఉంటుంది. దీంతో కెప్టెన్ దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, సురంగ లక్మల్, దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు కేంద్ర ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటన గురించి సస్పెన్స్ ఉన్నది. మే 23 నుంచి బంగ్లాదేశ్ లో ఈ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది.
మాథ్యూస్‌కు తగ్గనున్నరూ.36 లక్షల జీతం
వెటరన్ ఆల్ రౌండర్ మాథ్యూస్ జీతం రూ.36 లక్షలకు తగ్గించారు. అంతకుముందు ఆయన జీతం దాదాపు రూ.95 లక్షలుగా ఉండేది. కొత్త ఒప్పందంలో దాదాపు రూ.59 లక్షలకు తగ్గించారు. వచ్చే నెలలో మాథ్యూస్ 34 ఏండ్ల వయసు పూర్తి చేసుకుంటుండటంతో.. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలను ఇవ్వడానికి బోర్డు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
కెప్టెన్‌కు కూడా తగ్గనున్న జీతం
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. అలాగే, ఫాస్ట్ బౌలర్ లక్మల్ కూడా రెండవ విభాగంలో చేర్చడంతో అతడి జీతం రూ.73 లక్షల నుంచి రూ.33 లక్షలు తగ్గనున్నది. దనుష్క గుణతిలకేను చివరి విభాగంలో చేర్చారు. ఈ ఒప్పందంలో ఆయన కొత్త జీతం దాదాపు రూ.22 లక్షలుగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
భద్రంగా అజ్మీర్‌లోని ఇజ్రాయెల్ మందిరం
24 మందితో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్రలో ఈ రోజు
యుద్ధం కొనసాగుతుంది: బెంజిమిన్ నెతన్యాహు
అమెరికా ఉద్యోగం కన్నా పాడిలో నాలుగింతలు ఎక్కువ సంపాదన : కిషోర్ మంత్రం
గంగా నది ఇసుకలో సమాధులు.. వెలికితీసిన వరుణుడు
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

