e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home General అమెరికా ఉద్యోగం క‌న్నా పాడిలో నాలుగింత‌లు ఎక్కువ సంపాద‌న : కిషోర్ మంత్రం

అమెరికా ఉద్యోగం క‌న్నా పాడిలో నాలుగింత‌లు ఎక్కువ సంపాద‌న : కిషోర్ మంత్రం

అమెరికా ఉద్యోగం క‌న్నా పాడిలో నాలుగింత‌లు ఎక్కువ సంపాద‌న : కిషోర్ మంత్రం

హైద‌రాబాద్ : అమెరికాలోని పెద్ద కంపెనీలో ఉద్యోగం.. ఐదంకెల జీతం.. అంద‌మైన కుటుంబం.. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఏదో తెలియ‌ని అసంతృప్తి.. మ‌రో ఆలోచ‌న చేయ‌కుండా కుటుంబంతోపాటు హైద‌రాబాద్ వ‌చ్చేశాడు. స్వ‌చ్ఛ‌మైన పాలు ప‌దిమందికిఅందేలా చేస్తున్నాడు. ఇదంతా వ్య‌వ‌సాయంపై మ‌క్కువ‌తోనే అని చెప్తున్నాడు ఇందుకూరి కిషోర్‌.

దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన కిషోర్‌కు బాగా చ‌దువుకుని అమెరికా వెళ్లాల‌ని క‌ల‌లుగ‌న్నాడు. ఒక్కో క‌ల‌ను నిజం చేసుకుంటూ ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో ఇంజినీరింగ్ చ‌దివాడు. అమెరికాలోని మాసాచుసెట్స్ యూనివ‌ర్షిటీ నుంచి పాలిమ‌ర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసి ఇంటెల్ సంస్థ‌లో ఉన్న‌తోద్యోగంలో చేరాడు. రోజులు, నెల‌లు, సంవ‌త్సరాలు గ‌డిచిపోతున్నా సంతృప్తి ల‌భించ‌డంలేదు. త‌న వ్య‌వసాయ మూలాల‌ను మ‌రిచిపోలేక పోతున్నాడు. కూర‌గాయ‌లు, పాలు, పండ్లు.. ఇలా అన్నీ కలుషిత‌మై పోతుండ‌టంతో తానెందుకు స్వ‌చ్ఛ‌మైన‌వి అందించ‌కూడ‌ద‌నే ఆలోచ‌న ఆయ‌న‌ను ఇండియాకు ర‌ప్పించింది. హైదరాబాద్ శివారు షాద్‌న‌గ‌ర్‌లో 2012 లో తొలుత‌ 20 ఆవుల‌తో డెయిరీ ప్రారంభించాడు. త‌న కుటంబంతోపాటు మ‌రికొంద‌రికైనా స్వ‌చ్ఛ‌మైన పాలు అందివ్వాల‌న్న ఆయ‌న కోరిక ఈ డెయిరీ ఏర్పాటుకు దారితీసింది.

2016 లో సిద్స్‌ ఫార్మ్ పేరుతో సంస్థ‌ను రిజిస్ట‌ర్ చేసి 120 మందికి ఉపాధి క‌ల్పించే స్థాయికి డెయిరీని అభివృద్ధి ప‌రిచాడు. ఈయ‌న ఫార్మ్ నుంచి నిత్యం దాదాపు 10,000 మంది వినియోగ‌దారుల‌కు ఆవు పాలు అందిస్తున్నారంటే ఎంత‌లా క‌ష్ట‌ప‌డ్డారో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌త ఏడాదిలో రూ.44 కోట్ల వ్యాపారం చేసిన కిషోర్‌.. స్విగ్గి, అమెజాన్‌, డుంజో, బిగ్ బాస్కెట్‌, క్యూబ్యాగ్ వంటి ఆన్‌లైన్ స‌ర‌ఫ‌రాదారుల‌తో ఒప్పందం చేసుకుని ఇంటివ‌ద్ద‌కే త‌న ఉత్ప‌త్తుల‌ను అంద‌జేస్తూ మ‌రింత ఉన్న‌త స్థాయికి చేరుకుంటున్నాడు.

ఇవి కూడా చ‌ద‌వండి..

గంగా న‌ది ఇసుక‌లో స‌మాధులు.. వెలికితీసిన వ‌రుణుడు

సీఎం ఖ‌ట్ట‌ర్‌కు రైతుల నిర‌స‌న‌.. హిసార్‌లో ప‌రిస్థితి ఉద్రిక్తం

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ అగ్రనేత ఇల్లు ధ్వంసం

టీకా ఉత్ప‌త్తులు వేగ‌వంతం చేయండి: మోదీకి ఆజాద్ లేఖ‌

యుద్ధం వ‌స్తే అమెరికాదే ఓట‌మి: గ్లోబ‌ల్ టైమ్స్ సంపాద‌కీయం

టెస్ట్ ఆడ‌ట్లేద‌ని నేన‌న‌లేదు : భువ‌నేశ్వ‌ర్ కుమార్

13 రోజులు ప్రధానిగా వాజ్‌పేయి.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమెరికా ఉద్యోగం క‌న్నా పాడిలో నాలుగింత‌లు ఎక్కువ సంపాద‌న : కిషోర్ మంత్రం

ట్రెండింగ్‌

Advertisement