knife Attack | ఆస్తి తగాదాలు.. యువకుడిపై కత్తితో బంధువుల దాడి
knife Attack | నిజామాబాద్ నగరంలోని అస్మీ కాలనీకి చెందిన సోహెల్ ఖాన్ అనే యువకుడు శనివారం రాత్రి బక్రీద్ సందర్భంగా నగరంలోని పులాంగ్ ప్రాంతంలో ఉండే తమ బంధువులైన షాహిద్ ఖాన్, సాజిద్ ఖాన్‌లను కలిసేందుకు వారి ఇంటికి వెళ్లాడు.
knife Attack | వినాయక నగర్, మే 31 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా బంధువుల మధ్య కొనసాగుతున్న ఆస్తి తగాదాలు కత్తిపోట్లకు దారితీశాయి. తమ బంధువుల ఇంటికి వచ్చిన యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. నిజామాబాద్ నాలుగవ టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ నగరంలోని అస్మీ కాలనీకి చెందిన సోహెల్ ఖాన్ అనే యువకుడు శనివారం రాత్రి బక్రీద్ సందర్భంగా నగరంలోని పులాంగ్ ప్రాంతంలో ఉండే తమ బంధువులైన షాహిద్ ఖాన్, సాజిద్ ఖాన్‌లను కలిసేందుకు వారి ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడ ఉన్న జావిద్ ఖాన్ అతని కుమారులు ఫర్జాన్, జియాన్, వారి బామ్మర్ది అక్బర్లు కలిసి సోహెల్‌పై అకారణంగా దాడికి పాల్పడ్డాడు తెలిపారు. అక్బర్ అనే వ్యక్తి కత్తితో సోహెల్ తలపై దాడి చేయడంతో తలకు బలమైన గాయమై రక్తస్రావం అయిందని తెలిపారు.
గాయాల పాలైన సోహెల్ కాను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రి తరలించారు. బాధితుడి ద్వారా నాలుగవ టౌన్ ఎస్సై సందీప్ వివరాలు సేకరించారు. అయితే సోహెల్ పై కత్తితో దాడి చేసిన అక్బర్ అనే వ్యక్తికి సాజిద్ ఖాన్‌కు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు సోహెల్ ఖాన్‌పై దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడి విషయమై బాధితుడి తండ్రి సలీం ఖాన్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తామని ఫోర్త్ టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్ వెల్లడించారు.
Read Also :
Naga Chaitanya | నీతో జీవితాన్ని పంచుకోవడం నా అదృష్టం.. శోభిత బర్త్‌డేపై నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu | ఎప్పటికీ మీరే నా హీరో నాన్న .. కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్
ముగ్గురు స్నేహితులను కాపాడి కాపాడి ఆ పై తాను మృతి చెంది..అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

