నాందేడ్: అకాలీదళ్ చీఫ్, మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal) పై ఇవాళ మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నగరం శివారు ప్రాంతంలో బాదల్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆయన తొలుత నగరంలోని ఫేమస్ గురుద్వారాను సందర్శించారు. నాందేడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి బాదల్‌ను తీసుకెళ్లారు. బాదల్ సెక్యూర్టీ సిబ్బంది దాడిలో గాయపడ్డారు. తక్త్ శ్రీ హజురు సాహిబ్ గురుద్వారాను బాదల్ విజిట్ చేశారు. అటాక్ జరిగిన సమయంలో బాదల్ భార్య , ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఉన్నారు. తన కుడి చేయికి ఓ కాషాయ బట్టను కట్టుకుని ఆస్పత్రికి వెళ్తున్న వీడియో ఒకటి రిలీజైంది. సుక్బీర్ బాదల్ చేతికి గాయమైంది. కానీ అది ప్రమాదకరం కాదని తెలిసింది. 2024 డిసెంబర్ 4వ తేదీన సుక్బీర్పై అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం వద్ద అటాక్ జరిగింది. సేవాదార్ డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో ఆ దాడి జరిగిన విషయం తెలిసిందే. నిహంగ్ సిక్కు తన వద్ద ఉన్న కిర్పన్ తల్వార్‌తో దాడి చేసినట్లు తెలుస్తోంది.
BREAKING: Sukhbir Singh Badal has reportedly been attacked by a Nihang Singh in Nanded. A police officer from his security detail was also injured. Badal is being taken to a private hospital for treatment.
Earlier in the morning, he had visited Takht Sri Patna Sahib with his… pic.twitter.com/Uj85kTm1FW
— Gagandeep Singh (@Gagan4344) August 13, 2026