Priyadarshi | దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన నాని హీరోగా నటించిన మూవీ ది ప్యారడైజ్ (The paradise). మోహన్ బాబు విలన్‌గా నటించగా.. కయాదు లోహర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. ది ప్యారడైజ్ను తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాని అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తుండగా.. ప్రత్యేకించి ఈ సినిమాలో వచ్చే కేసీఆర్ పాత్ర శంకరన్నకు తెలంగాణ ప్రజలు బాగా కనెక్ట్ అవుతున్నారు.
సక్సెస్ ఈవెంట్లో ప్రియదర్శి తాను పోషించిన శంకరన్న పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఒక నటుడిగా నన్ను నేను ఆవిష్కరించుకోవాలని నాకు పొట్టు పొట్టు ఆకలి ఉంది. అప్పుడొక షేర్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి శంకరన్న పిలుస్తుండు రా అంటే.. మా దొర మా షేర్ శ్రీకాంత్ ఫోన్ చేసి కేసీఆర్ పాత్ర చేయాలి అంటే నాకు చాలా భయమేసింది.. కానీ భయమేసినప్పుడే కదా చాలెంజ్ విలువ ఏంటో తెలిసేది. అప్పుడే కాదనకుండా శంకరన్న పాత్ర తీసుకోవడం జరిగింది. శంకరన్న వేసుకునే బట్టలు ఎక్కడ దొరుకుతాయో వెతికి మరీ పోయి అబిడ్స్‌లో కొన్నడు. ఆ బట్టలు ఎట్లుండాలే.. ఏం చేయాలే.. చెప్పులు ఎట్లా వేసుకుంటడు. ఆ వాచ్ ఎట్లా పెట్టుకోవాలి. తర్వాత మా మేకప్ టీం.. ప్రోస్తటిక్ టీం చాలా మంది శంకరన్నను తయారు చేసిండు. అది ఒక్క రోజులో వచ్చింది కాదు.. దాని వెనుకాల చాలా రీసెర్చ్ ఉండేది. చాలా పనితనం ఉండే.. చాలా నైపుణ్యం ఉండేనని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.
కేసీఆర్ గారి క్యారెక్టర్ చేయమన్నపుడు భయం వేసింది
– ప్రియదర్శి https://t.co/uRPzvILIuU pic.twitter.com/AkCUVzPRC8
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2026
శంకరన్న పాత్ర కోసం కేసీఆర్ గారు ఎక్కడ బట్టలు కొంటాడో తెల్సుకుని, ఏ చెప్పులు వాడతారు అన్నీ రీసెర్చ్ చేసి చేసినం
– ప్రియదర్శి https://t.co/j0sGhArzdn pic.twitter.com/ozTOXONXn5
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2026