Naga Chaitanya | నీతో జీవితాన్ని పంచుకోవడం నా అదృష్టం.. శోభిత బర్త్‌డేపై నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్
SobhitaDhulipala | నటుడు నాగచైతన్య తన భార్య శోభితా ధూళిపాళ్ల 34వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు.
Naga Chaitanya | నటుడు నాగచైతన్య తన భార్య శోభితా ధూళిపాళ్ల 34వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు. ఆదివారం నాడు ఆయన షేర్ చేసిన ఈ పోస్ట్‌లో వీరిద్దరి ప్రయాణానికి సంబంధించిన కొన్ని అందమైన క్షణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వారు కలిసి వెళ్లిన ట్రెకింగ్ ఎస్కేప్‌లు, క్యాజువల్ డేట్ నైట్స్, సరదాగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలను చైతన్య ఈ సందర్భంగా పంచుకున్నారు. ఈ ఫోటోలతో పాటు, పుట్టినరోజు శుభాకాంక్షలు నా లేడీ శోభితా.. నీతో కలిసి ఈ జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నందుకు చాలా కృతజ్ఞతగా ఉంది అంటూ ఒక అందమైన నోట్‌ను కూడా జతచేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు శోభితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ జంట కెమిస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం 2024 డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సాంప్రదాయ తెలుగు హిందూ పద్ధతిలో వైభవంగా జరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

