Asian Games : ఆసియా క్రీడల్లో పోటీపడే మహిళల క్రికెట్ జట్లు ఖరారయ్యాయి. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి మేటి జట్లతో చైనా, థాయ్‌లాండ్, మలేషియా తలపడే అవకాశాన్ని దక్కించుకున్నాయి. కౌలాలంపూర్ వేదికగా జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో చివరి మూడు బెర్తులను ఈ మూడు పట్టేశాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో మలేషియా, థాయ్‌లాండ్ ఫైనల్ చేరగా.. చైనా మూడో స్థానంతో ఆసియా క్రీడలకు అర్హత సాధించింది.
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో మే 26 నుంచి మే 31 వరకూ ఆసియా క్రీడల క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ జరిగింది. గ్రూప్ ఏలో మలేషియా, హాంకాంగ్‌పై విజయాలతో థాయ్‌లాండ్ అగ్రస్థానం సాధించింది. గ్రూప్ బీలో ముందున్న నేపాల్.. సెమీఫైనల్లో మలేషియా చేతిలో ఓడింది. ఫైనల్లో తలపడిన మలేషియా, థాయ్‌లాండ్ జట్లకు నేరుగా ఆసియా క్రీడల బెర్తు దక్కింది.
The three teams join the four Full Members – Bangladesh, India, Pakistan and Sri Lanka – and hosts Japan at the main eventhttps://t.co/1zcnyoNRsM pic.twitter.com/Lu39ebRIZP
— ESPNcricinfo (@ESPNcricinfo) May 31, 2026
మూడో స్థానం కోసం చైనా, నేపాల్ పోటీపడగా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఐదు వికెట్లతో గెలుపొందిన చైనా అర్హత సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ మధ్యలో జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చుర్, నగొయ ప్రాంతాల్లో ఆసియా క్రీడల క్రికెట్ పోటీలు జరుగనున్నాయి.
మహిళల క్రికెట్ జట్లు : భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్, జపాన్, చైనా, మలేషియా, థాయ్‌లాండ్.