మరికల్, ఆగస్టు 14 : ఆర్టీసీ బస్సు టైరు పేలి మహిళకు గాయాలైన ఘటన శుక్రవారం మరికల్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నారాయణపేట కు వెళ్తుండగా మరికల్ పెద్ద చెరువు దగ్గర టైర్ పగిలింది.
బస్సులో హైదరాబాద్ నుంచి నారాయణపేటకు (అటునుంచి బద్దెపల్లి) తమ బంధువుల అంత్యక్రియల నిమిత్తం వెళ్తున్న మాధ వి, సంతోష్‌కుమార్ లు టైర్‌పై ఉన్న సీటులో కూర్చోవడంతో ఒక్కసారిగా టైర్ పేలి బస్సులోకి టైర్‌పై ఉన్న రేకు బలంగా పైకిలేవడంతో ఆ సీటులో ఉన్న భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. మాధవి కాలుకు బలవైన గాయం కాగా సంతోష్‌కుమార్‌కు మూగదె బ్బ తగిలింది. వెంటనే వారిని 108 లో మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు.