GT vs RCB : పంతొమ్మిదో సీజన్ విజేత ఎవరో మరికాసేపట్లో తేలిపోనుంది. లీగ్ దశలో.. ప్లే ఆఫ్స్‌లో అత్యుత్తమ ఆటతో ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే కసితో ఉన్నాయి. అహ్మదాబాద్ స్టేడియంలో ఇరుజట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ తీసుకున్నాడు.
ఐపీఎల్ ట్రోఫీని ఇదివరకే పట్టేసిన ఆర్సీబీ, గుజరాత్ మరోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు పోటీపడుతున్నాయి. 2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో టైటిల్ అందుకున్న గుజరాత్‌ను ఈసారి శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో విజయంపై కన్నేసింది. 18వ సీజన్లో కప్ కొట్టిన ఆర్సీబీ.. ఈసాలా కప్ నమదే అంటూ వరసగా రెండో ఫైనల్ ఆడుతోంది. దాంతో.. ట్రోఫీని గెలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది.
🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ
— IndianPremierLeague (@IPL) May 31, 2026
లీగ్ దశలో చెరొక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ, గుజరాత్ ఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యాయి. క్వాలిఫయర్ 1లో బెంగళూరు చేతిలో కంగుతిన్న గుజరాత్ క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. రాజస్థాన్‌పై శతకంతో కదం తొక్కి శుభ్‌మన్ గిల్(104) బిగ్ మ్యాచ్‌లో చెలరేగాని గుజరాత్ భావిస్తోంది. విరాట్ కోహ్లీ, పడిక్కల్, పటిదార్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మలతో బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ మెరుగ్గా ఉంది. గుజరాత్ బౌలింగ్ యూనిట్ రబడ, సిరాజ్, హోల్డర్‌తో ప్రమాదకరంగా ఉంది. ర్లకు, ఆర్సీబీ బ్యాటర్లకు మధ్య తగ్గపోరు ఉండనుంది.
గుజరాత్ తుది జట్టు : సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), బట్లర్(వికెట్ కీపర్), సుందర్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, హోల్డర్, రషీధ్ ఖాన్, సిరాజ్, రబడ, అర్షద్ ఖాన్.
కృష్ణ, సాయి కిషోర్.
ఇంప్యాక్ట్ సబ్స్ – ప్రసిధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుషగ్ర, సాయి కిశోర్
ఆర్సీబీ తుది జట్టు : విరాట్ కోహ్లీ, పడిక్కల్, రజత్ పటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్, జాకబ్ డఫ్ఫీ, హేజిల్‌వుడ్, రసిక్ దార్ సలాం.
ఇంప్యాక్ట్ సబ్స్ – వెంకటేశ్ అయ్యర్, కనిశ్క్ చౌహన్, స్వప్నిల్ సిఇంగ్, అభినందన్ సింగ్, జోర్డన్ కాక్స్.