ఓలి ప్రమాణ స్వీకారంపై వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ
నేపాల్‌లో కేపీ శర్మ ఓలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని ప్రశ్నిస్తూ నాలుగు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి

ఖాట్మండు : నేపాల్‌లో కేపీ శర్మ ఓలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని ప్రశ్నిస్తూ నాలుగు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. శుక్రవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్రపతి విద్యా దేవి భండారి చెప్పిన వాక్యం చెప్పకుండా రాష్ట్రపతిని అగౌరవపరిచారని పిటిషన్లలో పేర్కొన్నారు. ఓలీ మళ్లీ ప్రమాణం చేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వం ఏర్పాటులో విఫలం కావడంతో మళ్లీ ఓలీకే రాష్ట్రపతి అవకాశం కల్పించారు. అందుకు అనుగుణంగా తన కార్యాలయంలో ప్రమాణ స్వీకారానికి ఓలిని రాష్ట్రపతి విద్యాదేవి భండారి శుక్రవారం ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా.. రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా దేవుడు, దేశం, ప్రజల సాక్షిగా అనే పదాన్ని రాష్ట్రపతి చెప్పారు. అయితే, ఈ వాక్యాన్ని చెప్పకుండా ఓలి ప్రమాణం పూర్తిచేశారు. 69 ఏండ్ల వయసునున్న ఓలి మూడోసారి నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రపతి గౌరవాన్ని దెబ్బతీశారు..
నేపాల్ ప్రధానిగా శుక్రవారం ఓలి చేసిన ప్రమాణ స్వీకారం చట్టవిరుద్ధమని నాలుగు పిటిషన్లలో పేర్కొన్నారు. అందువల్ల, ఓలి మళ్లీ ప్రమాణం చేసేట్లుగా ఆదేశించాలని పిటిషన్‌దారులు కోర్టును కోరారు. ఇది ముమ్మాటికీ రాష్ట్రపతి గౌరవాన్ని దెబ్బతీయడమే అని వారు చెప్పారు. ఈ పిటిషన్లను సీనియర్ న్యాయవాదులు చంద్రకాంత్ గ్యవాలి, లోకేంద్ర ఓలి, కేశర్జంగ్ కేసీ, రాజ్‌కుమార్ సువాల్, సంతోష్ భండారి, నవరాజ్ అధికారి దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి..
బైడెన్ కన్నా కమలా సంపాదన ఎక్కువ.. ఎంత పన్ను చెల్లిస్తున్నారంటే..?!
టీకా దౌత్యానికి భారత్, దక్షిణాఫ్రికాకు చైనా మద్దతు
ఇక న్యూయార్క్‌లో దీపావళి సెలవుదినం..?
వచ్చే నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన
ముగిసిన ఎల్టీటీఈ శకం.. చరిత్రలో ఈరోజు
నితీష్జీ.. నా కోసం పెండ్లిళ్లపై నిషేధం విధించరూ..?!
కరోనా ముప్పు దృష్ట్యా పాఠశాలల మూసివేతకు నిర్ణయం
అధిక రక్తపోటు.. చేయాల్సినవి.. చేయకూడనివి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

