కోదాడ, మే 30 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయీభవ ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోదాడ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 250 మంది ఉత్తమ విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. చారు గుండ్ల ప్రవీణ రాజశేఖర్ సభా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శివారెడ్డి మాట్లాడుతూ విజయీభవ ట్రస్ట్ ద్వారా అందుతున్న విద్యా సేవలు అద్వితీయమని, ఇవి విద్యార్థుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయన్నారు. పేద విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, మానసిక వికాసం పెంచేందుకు వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించడంతో పాటు, ఫలితాలు వచ్చాక ఇలా ప్రతిభ అవార్డులతో సత్కరించడం సమాజానికి ఆదర్శనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విజయీభవ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు నీలా సత్యనారాయణ, గౌరవ సలహాదారు పైడిమర్రి సత్య బాబు, అవొపా జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రమేష్, ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు గరిణే ఉమామహేశ్వరి శ్రీధర్, విజయీభవ ట్రస్ట్ సలహాదారులు పందిరి సత్యనారాయణ, యాదా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వంగవీటి లోకేష్, కోశాధికారి ఇరుకుల్ల చెన్నకేశవరావు, సభ్యులు వెంపటి వెంకటరమణ, పట్టి నరేందర్, చీదేడ్ల హనుమంతరావు, దేవరశెట్టి శంకర్, మహిళా సభ్యులు ఓరుగంటి రమాదేవి, చిట్టిప్రోలు పద్మావతి, వంకాయల స్వాతి, కొండూరు మాధవి, వంగవీటి సత్య పాల్గొన్నారు.