e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News పిల్లలపై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిలిపివేయాల‌న్న పిటిష‌న్ తోసివేత‌

పిల్లలపై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిలిపివేయాల‌న్న పిటిష‌న్ తోసివేత‌

పిల్లలపై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిలిపివేయాల‌న్న పిటిష‌న్ తోసివేత‌

న్యూఢిల్లీ : చిన్న పిల్ల‌ల‌పై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిలిపివేసేలా ఆదేశాలివ్వాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అలాంటి ఆదేశాలు ఇచ్చేందుకు నిరాక‌రించింది. పిటిషన్‌పై స్పంద‌న తెలియ‌జేయాల‌ని కేంద్రం, డీజీసీఐని కోర్టు ఆదేశించింది.

కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌డం ఆపాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిష‌న్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు బుధవారం తమ అభిప్రాయాలను జూలై 15 లోగా సమర్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ), భారత్ బయోటెక్ సంస్థ‌లకు నోటీసు జారీ చేసింది. అయితే, ట్ర‌య‌ల్స్ నిర్వ‌హణ‌ను ఆపేందుకు కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ తో కూడిన ధర్మాసనం విచారించింది. సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేసి పిల్లలపై కోవాగ్జిన్ ట్ర‌య‌ల్స్‌ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

వచ్చే 10-12 రోజుల్లో ట్రయల్స్

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) పిల్లలపై కోవాగ్జిన్ రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌ను ఆమోదించడానికి ముందు.. ఈ ట్ర‌య‌ల్స్‌ వచ్చే 10-12 రోజుల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 18 ఏండ్ల‌కు పైబ‌డిన వారికి కోవాగ్జిన్ టీకాల‌ను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

న‌టి మెర్కెల్‌ను వివాహ‌మాడిన ప్రిన్స్‌ హ్యారీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

బ‌ట్ల‌ర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ XI లో ధోనీ, కోహ్లీ, శ‌ర్మ‌కు చోటు

కోడి మెద‌ళ్లు తిన్నా.. 111 ఏండ్లు బ‌తికున్నా..!

క‌న్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ క‌నిపెట్టిండు..!

ఓలి ప్రమాణ స్వీకారంపై వివాదం.. సుప్రీంకోర్టులో విచార‌ణ‌

బైడెన్ క‌న్నా క‌మ‌లా సంపాద‌న ఎక్కువ‌.. ఎంత ప‌న్ను చెల్లిస్తున్నారంటే..?!

వ‌చ్చే న‌వంబ‌ర్‌లో బంగ్లాదేశ్‌లో టీమిండియా ప‌ర్య‌ట‌న‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పిల్లలపై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిలిపివేయాల‌న్న పిటిష‌న్ తోసివేత‌

ట్రెండింగ్‌

Advertisement