CUET UG 2026 | కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో సాంకేతిక సమస్య.. కొందరు అభ్యర్థుల కోసం మళ్లీ పరీక్ష
CUET UG 2026 | కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో సాంకేతిక సమస్య వల్ల కొందరు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆ అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది.
న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG 2026)లో సాంకేతిక సమస్య వల్ల కొందరు అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆ అభ్యర్థులకు మరో అవకాశం ఇస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. కొత్త పరీక్ష తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది. శనివారం సాంకేతిక సమస్య వల్ల పరీక్ష నిర్వహణలో తీవ్ర జాప్యం జరిగిందని ఎన్డీఏ తెలిపింది. పరీక్ష తిరిగి ప్రారంభమైన తర్వాత చాలా మంది అభ్యర్థులు (సుమారు 95 శాతం) తమ పరీక్షను పూర్తి చేసినట్లు పేర్కొంది.
అయితే పరీక్షకు హాజరై, బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, పరీక్ష తిరిగి ప్రారంభం కాకముందే వెళ్ళిపోయిన మిగిలిన 3,765 మంది అభ్యర్థుల కోసం మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ కొత్త తేదీ, సంబంధిత వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
కాగా, శనివారం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG 2026) నిర్వహణలో అంతరాయాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాలలో సాంకేతిక లోపం కారణంగా పరీక్షల ప్రారంభం ఆలస్యమైంది. ప్రధానంగా రెండవ షిఫ్ట్‌పై ప్రభావం చూపింది. దీనివల్ల అనేకమంది విద్యార్థులు తమకు కేటాయించిన రిపోర్టింగ్, పరీక్షా సమయాల కంటే చాలా ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రభావిత అభ్యర్థుల కోసం పరీక్ష కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. అయితే పరీక్ష నిర్వహణలో తలెత్తిన సాంకేతిక సమస్యపై టీసీఎస్ క్షమాపణ చెప్పింది.
Update on CUET (UG) 2026 — 30 May, Shift 1
Earlier today, some centres faced a technical glitch that delayed the start of Shift 1. We know this was stressful, and we’re sorry for the anxiety it caused.
The technical service provider, TCS iON, has been asked to conduct a…
— National Testing Agency (@NTA_Exams) May 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
Medicover Hospital | మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన : కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
Blue Drum Case | బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడికి మరణ శిక్ష.. మీరట్ కోర్టు సంచలన తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

