Hit And Run | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు దేశవ్యాప్తంగా ఏ రేంజ్లో హాట్ టాపిక్‌గా మారిందో తెలిసిందే. ఇప్పుడిదే క్రేజీ టైటిల్‌తో సినిమా చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు పాపులర్ తెలుగు యాక్టర్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్. ఓ పిట్ట కథ, స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమాల తర్వాత సంజయ్ రావ్ నటిస్తోన్న మూవీ ‘హిట్ అండ్ రన్’ (Hit And Run) క్రైం థ్రిల్లర్ జోనర్లో వస్తోంది.
సాయి కృష్ణ సాగర్ డైరెక్ట్ చేస్తున్న ‘హిట్ అండ్ రన్’ చిత్రంలో నటాషా సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. సంజయ్ రావ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ విడుదల చేసిన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది. సంజయ్ రావ్ తలకు గాయమై రక్తం కారడం చూడొచ్చు. చుట్టూ బ్లడ్ షెడ్ కనిపిస్తుండగా.. ఇంతకీ అతడికి గాయమెలా అయింది.. ఆ గాయం వెనకాల ఉన్నది ఎవరనేది సస్పెన్స్ నెలకొంది.
పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ టీజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి టీజర్ ద్వారా ఈ సినిమా ఎలాంటి కాన్పెప్ట్‌తో రాబోతుందనేది హింట్ ఇస్తారేమో చూడాలి. ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో అల్లం ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లక్ష్మి నరసింహా స్వామి క్రియేషన్స్ బ్యానర్లపై అల్లం, కే శేఖర్ నిర్మిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసుకు ఏమైనా లింక్ ఉందా..? లేదా వేరే ఏదైనా స్టోరీతో వస్తుందా..? అనేది ఆసక్తి నెలకొంది.
A powerful title. A striking first look💥#HitandRun it is 🔥
Team #HitAndRunMovie wishes a very Happy Birthday to @SanjayROfficial ❤
Heartfelt thanks to @sreevishnuoffl garu For launching the title & first look of #HitAndRun 🔥@natashasingh122 @actorbrahmaji @satish402… pic.twitter.com/F9NIlkwxAd
— BA Raju’s Team (@baraju_SuperHit) May 29, 2026
This Weekend OTT | ‘జెట్ లీ’, ‘కర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాలివే!
Rajamouli | ‘వారణాసి’కి మళ్లీ లీకుల బెడద.. జక్కన్న మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి?
Transgender Influencer: మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్‌జెండర్ ఇన్ఫ్లూయెన్సర్