చండీఘడ్: పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న సామనా పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్(Transgender Influencer) అభ్యర్థి కోమల్ మహంత్ చరిత్రాత్మక విజయం సాధించింది. సోషల్ మీడియాలో తనకు ఉన్న పాపులారిటీని ఆమె ఓట్ల రూపంలో సొంతం చేసుకున్నది. సామనా మున్సిపాల్టీలోని వార్డు నెంబర్ 18 నుంచి ఆమె గెలుపొందింది. శిరోమణీ అకాళీదళ్ టికెట్‌పై విక్టరీ సాధించింది. 505 ఓట్ల తేడాతో మహంత్ విజయం నమోదు చేసింది. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు ఆమె టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. తన ప్రచారం కోసం ఆమె ఎక్కువగా డిజిటల్ మీడియాపై ఆధారపడింది. స్థానికంగా యువ ఓటర్లను ఆమె అట్రాక్ట్ చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో కోమల్ మహంత్‌కు సుమారు 64 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. యువత సంక్షేమం, డ్రగ్ వ్యతిరేక అవగాహన, పట్టణాభివృద్ధి లాంటి అంశాలపై ఆమె ఫోకస్ పెట్టనున్నట్లు చెప్పింది. దీంతో పాటు డోర్-టు-డోర్ ప్రచారం కూడా నిర్వహించింది. ఆన్లైన్ మద్దతును ఆమె ఓట్లుగా మలుచుకున్నది. ట్రాన్స్‌జెండర్ ఇన్ఫ్లూయెన్సర్గా ఆమె సోషల్ మీడియాలో పేరున్నది. మార్పు తీసుకురానున్నట్లు ఆమె తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నది. తన వ్యక్తిగత ఆదాయం నుంచి ఆరు లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చింది.