Boat Capsizes: ఓవర్‌లోడ్‌తో బోటు బోల్తా.. జింబాబ్వేలో 15 మంది మృతి, 27 మంది మిస్సింగ్
Boat Capsizes: జింబాబ్వేలోని కరీబా సరస్సులో బోటు బోల్తా(Boat Capsizes) పడింది. ఆ ఘటనలో సుమారు 15 మంది మృతిచెందగా, 27 మంది మిస్సయ్యారు. ఓవర్‌లోడ్ వల్ల బోటు బోల్తా పడినట్లు అంచనా వేస్తున్నారు.
హరారే: జింబాబ్వేలోని కరీబా సరస్సులో బోటు బోల్తా(Boat Capsizes) పడింది. ఆ ఘటనలో సుమారు 15 మంది మృతిచెందగా, 27 మంది మిస్సయ్యారు. ఓవర్‌లోడ్ వల్ల బోటు బోల్తా పడినట్లు అంచనా వేస్తున్నారు. బోటు ప్రమాదం నుంచి సుమారు 77 మందిని రక్షించారు. సరస్సు మధ్యలో బోటు మునక వేయడంతో.. ప్రయాణికులను రక్షించేందుకు చిన్న బోట్లు రంగంలోకి దిగాయి. బోల్తా పడిన బోటు వద్దకు స్పీడ్బోట్లు చేరుకున్న వీడియోను రిలీజ్ చేశారు. భారీ బృందంతో రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. కరీబా సరస్సు.. జింబాబ్వే, జాంబియా మధ్య ఉంటుంది. టికెట్ అమ్మకాల ద్వారా బోటులో సుమారు 114 మంది ప్రయాణికులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయిదు మంది సిబ్బంది ఉన్నారు.
I am deeply saddened to hear that a boat carrying 90 people capsized on Lake Kariba in Zimbabwe today.
The boat, owned by the Rural Infrastructure Development Agency (RIDA), a government agency, was on Lake Kariba when it capsized. The head of RIDA is quoted as saying that the… pic.twitter.com/ou8xv91YHo
— Hopewell Chin’ono (@daddyhope) August 11, 2026
చిన్నపిల్లలకు టికెట్ ఉండదు కాబట్టి, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. బోటు సామర్థ్యం 90 మంది కాగా, ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నట్లు గుర్తించారు. కరీబా పట్టణానికి చేరుకునేందుకు గ్రామీణ జనం ఎక్కువగా బోటుపై ఆధారపడుతారని చెబుతున్నారు. జర్నీ సమయం సుమారు 5 గంటలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని జింబాబ్వే పోలీసులు వెల్లడించారు.
1950 దశకంలో కరీబా సరస్సును నిర్మించారు. జాంబేజీ నదిపై భారీ డ్యామ్‌ను కూడా నిర్మించారు. డ్యామ్ దగ్గర నీరు వల్ల భారీ సరస్సు ఏర్పడింది. సుమారు 200 కిలోమీటర్ల పొడుగు, 40 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. జింబాబ్వే, జాంబియా దేశాలు ఈ సరస్సును షేర్ చేసుకుంటాయి.
This is the RIDA boat named Mbuya Nehanda taking off earlier before the tragedy struck on Lake Kariba today. Communities used this boat as transport from rural Kariba to Kariba urban. It would take some 5hrs or so to cross Lake Kariba. We have very hard questions that require… pic.twitter.com/CF2TEsoki0
— Mutsa Murombedzi MP🇿🇼 (@mutsamu) August 11, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

