Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Health Tips | వేసవి ఆగమనంతోనే మార్కెట్లోకి మామిడి పండ్ల (Mangoes) రాక మొదలవుతుంది. మన దేశం మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మరెక్కడా లభించనన్ని రకాల మామిడి పండ్లు భారత్ (India) లో లభిస్తాయి. అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు రకరకాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి.
Mangoes : వేసవి ఆగమనంతోనే మార్కెట్లోకి మామిడి పండ్ల (Mangoes) రాక మొదలవుతుంది. మన దేశం మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మరెక్కడా లభించనన్ని రకాల మామిడి పండ్లు భారత్ (India) లో లభిస్తాయి. అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు రకరకాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ మామిడి పండ్లను నేరుగా తినొచ్చు. జ్యూస్‌లుగా చేసుకుని తాగవచ్చు. మామిడి తాండ్ర, మామిడి కరేలా లాంటి పదార్థాలు తయారు చేసుకుని కూడా తినొచ్చు. అయితే ఈ మామిడిపండ్లు తిన్న తర్వాత ఓ ఐదు రకాల పదార్థాల జోలికి అస్సలు పోవద్దట. ఆ పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం..
మంచి నీళ్లు : మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతసేపటి వరకు మంచినీళ్లను అస్సలు తాగొద్దట. అలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందట. కడపు నొప్పి, అసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట.
పెరుగు : మామిడి పండు తినగానే పెరుగు తీసుకుంటే శరీరం డీహైడ్రేట్ అవుతుందట. అందువల్ల అలాంటి అలవాటు ఉంటే తక్షణమే మానుకోవాలట. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందట. అంతేగాక చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నదట.
కాకరకాయ : మామిడి పండ్లు తిన్న తర్వాత కాకరకాయ తీసుకోవడం కూడా మంచిది కాదట. అలా చేయడంవల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయట.
ఘాటైన పదార్థాలు : మామిడి పండ్లు తిన్న తర్వాత ఘాటు పదార్థాలుగానీ, కారం పదార్థాలుగానీ తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదట. అంతేగాక ముఖంపై మొటిమలు వచ్చే ప్రమాదం కూడా ఉన్నదట.
చల్లటి పానీయాలు : మామిడి పండ్లతోపాటు చల్లటి పానీయాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమట. చల్లటి పానీయాలతో మామిడి పండ్లను తీసుకోవడంవల్ల షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయట.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

