న్యూఢిల్లీ: రిస్క్ లేని అత్యంత ప్రాధాన్య ఇన్వెస్మెంట్ పథకంగా పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్) నిలుస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, అధికారులు రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తంలో కార్పస్ ఫండ్ అందిస్తుంది. అంతే కాదు.. దీనికి ఆదాయం పన్ను (ఐటీ) నుంచి మినహాయింపు లభిస్తుంది.
పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టిన మదుపర్లు ప్రతియేటా ఆదాయం పన్ను (ఐటీ) చట్టం -61 ప్రకారం తమ ఐటీ రిటర్న్స్‌లో పన్ను మినహాయింపు కోరవచ్చు. ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న చిన్న మొత్తాల పొదుపు పథకం.. ఎటువంటి క్యాపిటల్ రిస్క్ లేదు.
ప్రతిఏటా పీపీఎఫ్ కింద పెట్టే పెట్టుబడులపై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తుంది. వార్షిక ప్రాతిపదికన ప్రస్తుతం పీపీఎఫ్ కింద చేసిన పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీరేటు అందిస్తున్నది.
ఇతర పన్ను మినహాయింపు పొదుపు పథకాలతో పోలిస్తే పీపీఎఫ్‌పై అధిక వడ్డీరేటు లభిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని ఈ వడ్డీరేటు అధిగమించడంతోపాటు భారీ మొత్తంలో కార్పస్ నిధి సమకూరుతుంది.
భారీగా లభించే కార్పస్ నిధి మీకు రిటైర్మెంట్ నిధిగా ఉపయోగించుకోవచ్చు. పిల్లల చదువులు, వివాహ ఖర్చులకు కూడా వాడొచ్చు. పీపీఎఫ్ కింద గరిష్ఠంగా ప్రతియేటా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు.
పీపీఎఫ్ ఖాతా 15 ఏండ్లకు మెచ్యూర్ అవుతుంది. ఐదేండ్ల చొప్పున పలు దఫాలు దీన్ని పొడిగిస్తారు. ఉదాహరణకు నెలకు రూ.12 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 15 ఏండ్లు పూర్తయిన తర్వాత అది రూ.39,05,480.85 అవుతుంది.
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారు మధ్యలో విత్ డ్రాయల్ చేయకుంటే.. 15 ఏండ్ల తర్వాత అది రూ.1.09 కోట్లకు పెరుగుతుంది. ప్రతిఏటా నిర్ణయించే వడ్డీరేటు ఆధారంగా పీపీఎఫ్ ఖాతాలో సొమ్ము పెరుగుతుంది.
అయితే, 25 ఏండ్ల వయస్సులో పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే 40 ఏండ్లకు మెచ్యూరవుతుంది. తదుపరి పెట్టుబడి పెట్టకుండా 55 ఏండ్ల వరకు ఈ ఖాతా కొనసాగించొచ్చు. అలా కొనసాగించడం వల్ల మీరు పెట్టిన రూ.39 లక్షల పెట్టుబడి రూ.1.09 కోట్లవుతుంది.
ఆ తర్వాత కూడా ఇదే పెట్టుబడిని మరికొంత కాలం పొడిగించేందుకు వెసులుబాటు ఉంది.. గరిష్ఠంగా 30 ఏండ్ల వరకు పొడిగించొచ్చు. అలా పొడిగించిన తర్వాత సదరు పీపీఎఫ్ ఖాతాలో మదుపు చేసిన మొత్తం రూ.1.48 కోట్లకు పెరుగుతుంది.
అయితే, వడ్డీరేట్లలో తేడాను బట్టి కార్పస్ నిధి మారుతూ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతా కింద ఆప్షన్ ఖరారు చేస్తే ఐదేండ్ల వరకు మార్చడం కుదరదు. ప్రారంభంలోనే ఎక్స్టెన్షన్ పీరియడ్‌ను మీరు తప్పనిసరిగా పేర్కొనాల్సి వస్తుంది.
తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసు.. విచారణ మే 21కి వాయిదా..!
ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!
క్రిప్టోకరెన్సీకి ట్విట్టర్ సీఈఓ వెన్నుదన్ను
తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?
కుటుంబాలకు ‘జంట’ కరోనా సవాళ్లు.. పెరిగిన ఇంధన, హెల్త్‌కేర్ ఖర్చు!!
క్రిప్టో బిజినెస్‌పై డ్రాగన్ నిషేధం! ఎలాగంటే!!
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్..