పుత్తడిని మించి వెండి తళతళలు

- నెలరోజుల్లో 7 శాతం పెరిగిన వెండి
- తాజాగా రూ. 2,000 జంప్.. పారిశ్రామిక డిమాండ్ కారణం
హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కమోడిటీల ర్యాలీలో కొద్దిరోజుల క్రితంవరకూ వెనుకబడిపోయిన వెండి, బంగారం ధరలు ఇప్ఫుడు హఠాత్తుగా పెరుగుతున్నాయి. ఈ రెండు విలువైన లోహాల్లో వెండి పెరుగుదల జోరుగా వుంది. గత నెలరోజులుగా పుత్తడి ధర 1.17 శాతం పెరగ్గా, వెండి ధర మాత్రం 7 శాతం ఎగిసింది. ఈ మంగళవారంకూడా ఇదేతీరున వీటి కదలికలు వున్నాయి. న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 333 పెరిగి (0.7 శాతం) రూ. 47,833కు చేరింది. సోమవారం ఈ ధర రూ. 47,500. తాజాగా కేజీ వెండి ధర ఏకంగా రూ. 2,021 పెరిగి (2.84 శాతం) రూ. 73,122 వద్ద ముగిసింది. క్రితం రోజు ఈ ధర రూ. 71,101.
బంగారాన్ని మించి వెండి పెరగడానికి కారణాలున్నాయి. పుత్తడి ధరను ఆభరణాల డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ప్రభావితం చేస్తుంటాయి. పారిశ్రామిక డిమాండ్ వెండి ధరను పెంచుతూవుంటుంది. ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడితే పుత్తడి జోరుగా పెరుగుతుంది. గతేడాది కొవిడ్ సంక్షోభం తలెత్తినపుడు బంగారం పెద్ద ర్యాలీ జరిపిన సంగతి తెలిసిందే. ప్రపంచ మార్కెట్లో పుత్తడి ఔన్సు ధర 2,000 డాలర్లను దాటగా, భారత్‌లో 10గ్రాముల ధర రూ. 55,000పైకి ఎగిసింది. ఆ సమయంలో వెండి ధర మాత్రం కనిష్టస్థాయిల్లో కొట్టుమిట్టాడింది. ఇప్పుడు కొవిడ్ ఉత్పాతం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బయటపడుతుందన్న విశ్వాసంతో ఇన్వెస్టర్లు బంగారానికి బదులు ఈక్విటీ మార్కెట్లతో పాటు పారిశ్రామిక వినియోగ లోహాల్లో నిధులు కుమ్మరిస్తున్న ఫలితంగా వెండి అధికంగా పెరుగుతోంది.
పారిశ్రామిక లోహాలైన అల్యూమినియం, రాగి, జింక్ తదితరాల ధరలు గత ఆరునెలల్లో రెట్టింపయ్యాయి. వీటితో పోలిస్తే ఇప్పటివరకూ వెండి వెనుకబడి వున్నందున, తాజా ర్యాలీ జరుగుతోంది. అమెరికా, చైనా మార్కెట్లలో వెండికి డిమాండ్ పుంజుకుంటున్నందున, ఈ లోహపు ధర మరింత పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. తాజా కమోడిటీ ర్యాలీలో పుత్తడి కూడా స్వల్పస్థాయిలో పాలుపంచుకోవడానికి కారణం డాలరు బలహీనంకావడమేనని వారు చెపుతున్నారు. ఇతర ప్రధాన కరెన్సీల విలువలతో పోలిస్తే డాలరు బలహీనపడిన సందర్భంలో కొద్దిపాటి పెట్టుబడులు బంగారంలోకి తరలి వస్తుంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- gold
- silver
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

