Guy Whittall | మాజీ క్రికెటర్‌పై చిరుత పంజా.. మృత్యువు నుంచి బయటపడ్డాడిలా..!
Guy Whittall : జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విట్టల్(Guy Whittall) ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చిరుత పులి (Leaopard) దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో, అతడిని హుటాహుటిన హెలిక్యాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు.
Guy Whittall : జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విట్టల్(Guy Whittall) ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చిరుత పులి (Leaopard) దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో, అతడిని హుటాహుటిన హెలిక్యాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యలు విట్టల్‌కు అత్యవసర సర్జరీ చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
అసలేం జరిగిందంటే.. గయ్ విట్టాల్ తన పెంపుడు కుక్క చికరాతో హుమని ప్రాంతంలో ట్రెక్కింగ్(Trekking)కు వెళ్లాడు. ఆ సమయంలోనే ఒక చిరుత పులి హఠాత్తుగా అతడిపైకి దూసుకొచ్చింది. ఊహించని పరిణామంతో విట్టాల్ షాక్ తిన్నాడు. ఆ సమయంలో పెట్ డాగ్ చికరా యజమాని ప్రాణాలు కాపాడేందుకు గట్టిగానే పోరాడింది.
చిరుత దాడి అనంతరం నెత్తురొడ్తున్న గయ్..

ఆ క్రమంలో ఆ చిరుత దానిపై కూడా దాడి చేసి పారిపోయింది. విషయం తెలిసిన వెంటనే విట్టాల్‌ను హెలిక్యాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం కావడంతో అతడికి వైద్యులు అత్యవసర సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. ఒకప్పుడు ఆల్‌రౌండర్‌గా రాణించిన గయ్ విట్టాల్ జింబాబ్వే మిడిలార్డర్‌కు వెన్నెముకగా పేరొందాడు.
గయ్ విట్టల్

ఈ సొగసరి బ్యాటర్ తన కెరీర్లో 46 టెస్టులు, 147 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాదు నాలుగు వన్డేల్లో జింబాబ్వే జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అయితే.. తరతరాలుగా వస్తున్న కుటుంబ వ్యాపారం చూసుకోవాలనే ఉద్దేశంతో 2003 మార్చిలో ఆటకు వీడ్కోలు పలికాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

