న్యూఢిల్లీ: పట్టణాలు, నగరాల్లో ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులు అత్యంత ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం పలు కంపెనీలు, బ్యాంకర్లు కలిసి క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. సదరు క్రెడిట్ కార్డులతో యూజర్లు ఆన్లైన్లో గానీ, ఫిజికల్ షాపింగ్ చేసినట్లయితే రివార్డు పాయింట్లు లభిస్తున్నాయి.
షాపింగ్‌పై రివార్డు పాయింట్లు ఇవ్వడం ద్వారా క్రెడిట్ కార్డులు ప్రజాదరణ పొందాయి. ఇతర సంస్థలతో కలిసి బ్యాంకులు జారీ చేసిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో ఆన్లైన్లో షాపింగ్ చేస్తే రివార్డు పాయింట్లు ఇస్తాయి. తమ అనుబంధ మర్చంట్ల ద్వారా స్థానిక కస్టమర్లకు రివార్డులు అందజేయడం ఉత్తమ మార్గంగా ఆనవాయితీగా వస్తున్నది.
తరుచుగా క్రెడిట్ కార్డుల వాడకంపై లభించే రివార్డు పాయింట్లు ఆధారపడి ఉంటాయి. సంబంధిత క్రెడిట్ కార్డులపై కస్టమర్లు కొంత నిర్దిష్ఠ మొత్తానికి జరిపే షాపింగ్‌పై బ్యాంకర్లు ఫ్రీ ఆఫర్లు అందిస్తున్నాయి. తరుచుగా జరిగే కొనుగోళ్లపై రీడిప్షంన్ ఆప్షన్లు కూడా ఇస్తాయి.
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను కొన్ని ప్రత్యేక, నిర్దిష్ట బ్రాండ్లకు అనుసంధానిస్తారు. కస్టమర్లు తమ క్రెడిట్ కార్డులతో తమకు నచ్చిన క్యాటగిరీ, లైఫ్ స్టైయిల్ కొనుగోళ్లపై ఆఫర్లు పొందొచ్చు. అత్యధిక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై లావాదేవీల ఫీజులు లేవు. కస్టమర్లకు సర్‌చార్జీలు మాఫీ చేశాయి.
మీరు నేరుగా అనుబంధ మర్చంట్ వద్ద కొనుగోళ్లు జరిపితే అత్యధిక రివార్డు పాయింట్లు పొందుతారు. ఉదాహరణకు ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డుపై ఫ్యూయల్ బెనిఫిట్లు లభిస్తాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును ప్రారంభించిన 20 నెలల్లోనే 10 లక్షల ఖాతాదారులను తమ అక్కున చేర్చుకున్నది.
కొంత నిర్దిష్ట మొత్తం విలువ గల షాపింగ్ చేసిన కస్టమర్లకు అత్యధికంగా పలు క్రెడిట్ కార్డులపై ఫీజులు మాఫీ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ మిలినియా, ఎస్బీఐ సింప్లీ క్రిక్ కార్డులపై రూ. లక్ష వరకు కొనుగోళ్లు జరిపితే రెన్యూవల్ ఫీ మాఫీ చేస్తున్నాయి.
రూ.2 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తే ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్ కార్డుపై వార్షిక ఫీజు రద్దవుతుంది. సిటీ రివార్డ్స్ కార్డు లిమిట్ ప్రతి ఏటా రూ.30 వేలు పెరుగుతుంది. క్రెడిట్ కార్డులపై సంబంధిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వార్షిక ప్రాతిపదికన వడ్డీరేట్లు ఖరారు చేస్తాయి.
సాధారణంగా వడ్డీరేట్లు 40 శాతానికి పైగా ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్ క్రెడిట్ కార్డు అత్యధికంగా 49.36 శాతం, అమెజాన్-ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై వడ్డీరేటు 42/46%, సిటీ రివార్డ్స్ కార్డుపై 45 % వడ్డీరేటు వసూలు చేస్తాయి.
భారీ మొత్తం విలువ షాపింగ్‌పై పలు క్రెడిట్ కార్డులు అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ మిలీనియా కార్డు మెంబర్షిప్ పే చేస్తున్నప్పుడు రూ.1000 పాయింట్లు ఆఫర్ చేస్తున్నది. తొలి 90 రోజుల్లో రూ.30 వేలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు రద్దవుతుంది.
ప్రతి త్రైమాసికానికి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తే తొలి ఏడాది సంబంధిత క్రెడిట్ కార్డుపై రూ.1000 గిఫ్ట్ ఓచర్ అందిస్తుంది. ప్రత్యేకంగా ఆన్లైన్ లావాదేవీలు జరిపితే అదనంగా ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందజేస్తున్నది. ప్రతి ఏటా ఎనిమిది కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్, ఒకశాతం ఫ్యూయల్ సర్‌చార్జి మాఫీ చేస్తున్నది.
ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్ కార్డు ఖాతాదారులకు రూ.2,900 బెనిఫిట్లతోపాటు ఫ్లిప్‌కార్ట్, మైంత్రా, 2జీయూడీలపై ఐదు శాతం, స్విగ్గీ, ఉబర్ కొనుగోళ్లపై నాలుగు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నది. క్రెడిట్ కార్డులు జారీ చేసిన 30 రోజుల్లో తొలి షాపింగ్ చేస్తే సిటీ బ్యాంకు 1500 బోనస్ పాయింట్లు అందిస్తుంది.
తరుణ్ తేజ్పాల్పై లైంగిక వేధింపుల కేసు.. విచారణ మే 21కి వాయిదా..!
ఐటీ కొలువుల మేళా : క్రెడిట్ సూస్ లో 1000కి పైగా టెకీల నియామకం!
క్రిప్టోకరెన్సీకి ట్విట్టర్ సీఈఓ వెన్నుదన్ను
తౌటే తుఫాన్: తౌటే అంటే అర్థం తెలుసా..?
కుటుంబాలకు ‘జంట’ కరోనా సవాళ్లు.. పెరిగిన ఇంధన, హెల్త్‌కేర్ ఖర్చు!!
క్రిప్టో బిజినెస్‌పై డ్రాగన్ నిషేధం! ఎలాగంటే!!
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ ఇన్వేస్టిగేషన్..