CM KCR Pressmeet| మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక విషయమై బీజేపీ దుష్ప్రచారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తప్పు బట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పాల్వాయి గోవర్దన రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి తనను వచ్చి కలిసి నట్లు దుష్ప్రచారం చేసిందని మండి పడ్డారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజం అని వ్యాఖ్యానించారు. తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పోరాడం, ఉద్యమాలు చేసినం అని చెప్పారు.
ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అంతా సక్రమంగా ఉన్నట్లు, లేకపోతే లేదన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తాము నాగార్జున సాగర్, హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో గెలిచాం అని గుర్తు చేశారు. దుబ్బాక, హుజూరాబాద్ స్థానాల్లో ఓటమి పాలయ్యాం అన్నారు. కానీ రాజకీయాల్లో సంయమనం పాటించడం అవసరం అని అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించడం సరి కాదన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విఫలం అయ్యారని బీజేపీ నేతలు ఆరోపించారని, ఇది అత్యంత దిగజారుడు విధానం అని పేర్కొన్నారు. ఇలా దిగజారడం సరి కాదన్నారు. ఈసీని నియమించేది కేంద్రమేనని గుర్తు చేశారు.
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్