Sara Tendulkar | వదిన కాదు.. సొంత చెల్లెలు దొరికింది: అర్జున్ పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ సారా ఎమోషనల్
Sara Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలు ముంబైలో ఇటీవల అత్యంత వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే.
Sara Tendulkar | క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకలు ముంబైలో ఇటీవల అత్యంత వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే. తన చిరకాల స్నేహితురాలు, పారిశ్రామికవేత్త సానియా చందోక్ను అర్జున్ మార్చి 5, 2026న వివాహం చేసుకోగా, ఈ వేడుకకు సంబంధించిన అరుదైన ఫొటోలను సోదరి సారా టెండూల్కర్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంటూ వదినపై తన ప్రేమను కురిపించింది.
తనకు ఎప్పటి నుంచో ఒక సోదరి ఉండాలని కోరుకునేదాన్ని, సానియా రూపంలో ఆ కోరిక తీరిందని సారా పేర్కొంది. సానియా ఇప్పటికే తమ కుటుంబంలో ఒక భాగమైపోయిందని, ఆమె రాకతో తమ ఇల్లు మరింత కళకళలాడుతుందని సారా ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ వేడుక కోసం ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా రూపొందించిన మల్టీకలర్ మిర్రర్ వర్క్ లెహంగాలో సారా పక్కా ట్రెడిషనల్ లుక్లో మెరిసిపోయింది. ఈ వేడుకకు ఎంఎస్ ధోనీ దంపతులు, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అంబానీ కుటుంబం వంటి క్రీడా, సినీ మరియు వ్యాపార రంగాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

