నా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటే నేను నిశ్శబ్దంగా ఊరుకోవాలా? : సీఎం కేసీఆర్
cm kcr | మా రాజధాని హైదరాబాద్కు వచ్చి నా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటే నేను నిశ్శబ్దంగా ఊరుకోవాలా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన
హైదరాబాద్ : మా రాజధాని హైదరాబాద్కు వచ్చి నా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటే నేను నిశ్శబ్దంగా ఊరుకోవాలా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన వ్యవహారంపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధోరణితో బీజేపీ ముఠా ముందుకు పోతున్నారు. ఈ దుర్మార్గాలు అరికట్టబడాలి. దుర్మార్గాన్ని ఉపేక్షించడం అనేది ఏ ఒక్కరికి, దేశం ఉనికికి మంచిది కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే బీజేపీ కొంటుంది. రూ. 100 కోట్లు ఇస్తం. గతంలో అలానే ఇచ్చాం. ఇది మాకు నిత్య కృత్యమే. మిగతావి కూడా చేసుకుంటాం. సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తమని చెప్తరు. సెంట్రల్ సెక్యూరిటీ వై కేటగిరి ఇస్తమని చెప్తరు. రాజ్యాంగేతర శక్తుల్లో భారత ప్రభుత్వం ఉంది. ఈ వీరవిహారం అరికట్టబడకపోతే అందరికీ ప్రమాదమే. ఈ పద్ధతిని ప్రతి ఒక్కరూ ఖండించాలి.
ప్రతి స్టేట్లో తమతో టచ్లో ఉన్నారని చెప్తరు. ప్రధానిగారే చెబుతున్నారు. ఇష్టమొచ్చినట్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా బయటకు రావాలి. డిమాండ్ చేస్తున్నా. కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారు. ఈ ఎన్నికలు ఇవన్నీ ఎందుకు. ఈ రకమైన పద్ధతులు మంచిది కాదు. మేం దుర్మార్గంగా ఎమ్మెల్యేలను కలుపుకోలేదు. కొందరు కాంగ్రెస్ మిత్రులు మాదగ్గరికి వచ్చి కలుస్తామని చెప్పారు. అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. చాలా రోజుల తర్వాత రాజ్యాంగబద్ధమైన పద్దతుల్లో కలుపుకొన్నాం. కానీ మీలా కొనుగోలు చేయలేదు. ఎమ్మెల్యేలను కొంటామని చెప్పి.. నీ ప్రభుత్వాన్ని కూలగొడుతామని అని మా రాజధాని హైదరాబాద్కు వచ్చి వ్యవహరిస్తే మేం చేతులు ముడుసుకొని కూర్చోవాలా? నా ప్రభుత్వాన్ని కూలగొడుతా అంటే నేను ఊరుకోవాలా? మీ హేయమైన, మీ అరాచక వ్యవహారాన్ని నిశ్శబ్దంగా భరించాలా? భరిస్తలేం. ఇది విస్పోటనం అని కేసీఆర్ పేర్కొన్నారు.
Read More :
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

