CM KCR Pressmeet | వీడియోలో 20 సార్లు అమిత్ షా పేరు, ఒకట్రెండు సార్లు మోదీ పేరు చెప్పారు : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు
CM KCR Pressmeet | : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే పార్టీలకు అతీతంగా కొట్లాడం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం గురించి కొన్ని విషయాలు మీరు వింటే ఆశ్చర్యపడుతారు. ఎంత భయంకరమైన దగా, కుట్ర. అయితే సఖ్యత లేదంటే ఈడీ అని బెదిరిస్తున్నారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొన్నది మేమే. ఆ తర్వాత లేబర్ వేషాలు వేయించి తీసుకెళ్లాం. ముంబైలో డబ్బులు ఇచ్చామని చెప్పారు. క్లియర్గా ఏం జరిగిందో చెప్పారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లామని చెప్పారు. 20 సార్లు అమిత్ షా పేరు, ఒకట్రెండు సార్లు మోదీ పేరు చెప్పారు.
ఈ వేల కోట్ల ధనం ఎక్కడిది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టారని ఇటీవలే ఓ పత్రిక వాళ్లు రాశారు. ఇవన్నీ బయటకు రావాలి. ఈ ముఠా నాయకుడు ఎవరో బయటకు రావాలి. ఈ డబ్బులను ఎవరు తీసుకొచ్చారు. ఈ దేశం యొక్క న్యాయవ్యవస్థతో దండం పెట్టి అడుగుతున్నా. ఈ దేశం ఎప్పుడు ప్రమాదంలో పడ్డ ఈ దేశాన్ని కాపాడింది జ్యుడిషీయరినే. తప్పకుండా కాపాడింది. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక మీద తీర్పు ఇచ్చింది. ఇంత స్వైరవిహారం సరికాదు. కర్ణాటక, మహారాష్ట్రలో కూలగొట్టింది మేమే అని నిసిగ్గుగా చెబుతున్నారు. రిసార్టుల్లో ఉండి ప్రభుత్వాలను కూలగొట్టామని చెప్పారు. భారతీయ న్యాయవ్యవస్థకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Read More :
హంతకుల స్వైర విహారం ఈ దేశం పునాదులకే ప్రమాదం : సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | బీజేపీ నుంచి దేశాన్ని కాపాడాలని వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్
CM KCR Pressmeet | రాబోయే రోజుల్లో జేపీ లాంటి ఉద్యమాలు చూడబోతరు : సీఎం కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

