Vishal | ఎంజీఆర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాజేంద్రప్రసాద్‌కి మొన్న వార్నింగ్, నిన్న ప్రశంసలు
Vishal | తమిళ సినీ దిగ్గజం ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో తెలుగు దిగ్గజ నటుడు కాంతారావు గొప్పతనాన్ని ప్రస్తావించే సందర్భంలో ఎంజీఆర్‌పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Vishal | తమిళ సినీ దిగ్గజం ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో తెలుగు దిగ్గజ నటుడు కాంతారావు గొప్పతనాన్ని ప్రస్తావించే సందర్భంలో ఎంజీఆర్‌పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఆయన ఉపయోగించిన పదజాలం తమిళ అభిమానులను తీవ్రంగా బాధించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఘటనపై తమిళ సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తమిళ నటులు విశాల్, నాజర్ వంటి ప్రముఖులు స్పందిస్తూ ఎంజీఆర్‌ను తమిళనాడులో ప్రజలు దేవుడిలా భావిస్తారని, అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. అలాగే తమిళనాడు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరఫున కూడా ఈ అంశంపై స్పందించాలని కోరినట్లు తెలిపారు.
వివాదం మరింత పెరుగుతున్న నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ వెంటనే స్పందించారు. ఈ విషయంపై ఒక వీడియో విడుదల చేసి ఎంజీఆర్ అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెప్పారు. తనకు ఎంజీఆర్‌పై అపారమైన గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాంతారావు అవార్డు కార్యక్రమంలో ఆయన గొప్పతనం గురించి మాట్లాడే సమయంలో అనుకోకుండా ఒక మాట తప్పుగా వచ్చిందని తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరి మనసును నొప్పించి ఉంటే క్షమించాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే తాను మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న సమయంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఎంజీఆర్ తమ ఇన్స్టిట్యూట్కు వచ్చి విద్యార్థుల ప్రదర్శనలు చూసిన విషయాన్ని కూడా వివరించారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి కావాలనే తప్పుగా మాట్లాడే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగవని, ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కోరారు.
రాజేంద్ర ప్రసాద్ విడుదల చేసిన ఈ క్షమాపణ వీడియోపై తాజాగా హీరో విశాల్ స్పందించారు. ఒక వీడియో ద్వారా ఆయన రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపారు. “ఎంజీఆర్ గురించి మీకే బాగా తెలుసు. మేమంతా కొత్తగా వచ్చినవాళ్లం. కానీ మీ వ్యాఖ్యల వల్ల చాలామంది సీనియర్ నటులు బాధపడ్డారు. అందుకే వెంటనే స్పందించాలని మేము కోరాం. మీరు మా అభ్యర్థనను గౌరవించి వెంటనే క్షమాపణ చెప్పినందుకు ధన్యవాదాలు,” అని విశాల్ అన్నారు. అదే సమయంలో మీలాంటి సీనియర్ ఆర్టిస్టుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా తాము ఇలాగే స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ఈ వివాదం ఇక్కడితో ముగియాలని కోరుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ali
- kanta rao
- MGR
- rajendra prasad
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

