హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ సాహితీ సంస్థ ‘శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం’ 125 వసంతాల సందర్భంగా తెలుగు ప్రత్యేక సాహిత్య సంకలన గ్రంథం ముద్రణకు సిద్ధమైంది. ఆసక్తి గల 40 ఏండ్లలోపు గల వారు ‘నాకు నచ్చిన తెలుగు’ అనే అంశంపై, తెలుగు భాషా ఔన్నత్యాన్ని కీర్తిస్తూ లేదా తెలుగు సాహిత్యంలోని కావ్యాలు, ఇతర ప్రక్రియల విశేషాలను విశ్లేషిస్తూ పద్య, గేయ, వచన కవితల రూపంలో 30 పంక్తులకు మించకుండా టైప్ చేసి పంపాలని నిర్వాహకులు ఉడయవర్లు, డా.ఆచార్య ఫణీంద్ర సూచించారు.
ఎంపికైన ఉత్తమ రచనలకు తగిన బహుమతులు అందజేస్తామని తెలిపారు. తమ రచనలను శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం, ఇంటి నెంబర్: 4-4-8, సుల్తాన్‌బజార్, హైదరాబాద్-500001 అనే చిరునామాకు ఈనెల 15వ తేదీలోగా పంపాలని సూచించారు. లేదా sktbn.org@gmail.com అనే మెయిల్‌కు పీడీఎఫ్ రూపంలో పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు (9885686415), డా.ఆచార్య ఫణీంద్ర (9959882963) నెంబర్లలో సంప్రదించవచ్చునని తెలిపారు.