సోమవారం 13 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:44:26

ఒకే రోజు 4.60 లక్షల మొక్కలు

ఒకే రోజు 4.60 లక్షల మొక్కలు

  • గిరిజన ఐఏఎస్‌ స్టడీసర్కిల్‌లో మొక్కలు నాటిన మంత్రులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గిరిజన గురుకులాల్లో పచ్చదనం పరిఢవిల్లనున్నది. హరితహారంలో భాగంగా ఆ శాఖ పరిధిలోని విద్యాలయాల్లో  మంగళవారం ఒక్క రోజే 4.60 లక్షల మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని గిరిజన ఐఏఎస్‌ స్టడీసర్కిల్‌లో మంత్రులు సత్యవతిరాథోడ్‌, సబితాఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఎస్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌ క్రిస్టినా జడ్‌చోంగ్తూ, ఏడీ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. logo