న్యూఢిల్లీ, మే 10: నెలకు రూ.888కే నెట్‌ఫ్లిక్స్ తదితర 15 యాప్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ కలిగిన ఓ బ్రాడ్‌బాండ్ ప్లాన్‌ను తీసుకొచ్చినట్టు రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. 30 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఇతరత్రా యాప్స్ ఉన్నాయని చెప్పింది. గతంలో రూ.1,499 ప్లాన్‌లో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ ఉన్న విషయం తెలిసిందే.