న్యూఢిల్లీ, మే 10: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) గత ఆర్థిక సంవత్సరం (2023-24) క్యూ4 లేదా చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.4,886 కోట్ల నికర లాభాన్ని అందుకున్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే త్రైమాసికంలో రూ.4,775 కోట్ల నికర లాభాన్ని పొందింది.
ఆదాయం ఈసారి రూ.33,775 కోట్లుగా నమోదైంది. పోయినసారి రూ.29,323 కోట్లుగా ఉన్నట్టు శుక్రవారం బ్యాంక్ తెలియజేసింది. ఇక స్థూల నిరర్థక ఆస్తులు 2.92 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 0.68 శాతానికి తగ్గాయి. కాగా, 2023-24కుగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌కు రూ.7.60 డివిడెండ్‌ను బీవోబీ బోర్డు సిఫార్సు చేసింది.