ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ నియమకమయ్యారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయిన అబ్దుల్ నజీర్‌ను ఏపీ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
వారంతపు సెలవు దినం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయాయి.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని విసన్నపేట మండలం అడ్డరోడ్డు వద్ద కారును లారీ ఢీ కొట్టింది. కారులో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
బ్రిటన్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ బాంబును మంగళవారం కనుగొని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పేలిపోయింది.
ఒకాయా ఈవీ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ప్రైస్ రూ.99,999. యాంటీ థెఫ్ట్ సిస్టం ఉండటం ఈ స్కూటర్ గొప్ప ఫీచర్.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తర్వాత మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇంట్లో రహస్య డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఈ నెపాన్ని న్యాయ శాఖపైకి నెట్టేందుకు పెన్స్ చూస్తుండటం విశేషం.
వివాహ శుభ కార్యక్రమానికి వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు నల్లగొండ జిల్లాలో ఈతకు వెళ్లి కాల్వలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
జీవన విధానంలో ఎదురయ్యే ఆరోగ్య ఇబ్బందులను గుర్తించి వాటిపట్ల అవగాహన కల్పించుకుంటే జబ్బుల నుంచి రక్షణ కల్పించుకోవచ్చని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి అన్నారు.
భారతదేశం ముస్లింల మాతృదేశమని, ఇతర ప్రాంతాల నుంచి ఈ మతం వచ్చిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. భారత పౌరుల మధ్య వివక్ష ఉండకూడదనే తమ సంస్థ విధానమన్నారు.
కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు వాసులు వలసలు పోయారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టులు తమ హయాంలోనే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను త�
ఢిల్లీ ప్రైవేట్ డిస్కం బోర్డుల్లోని ఆప్ నేతలను ఎల్జీ తొలగించారు. వీరి స్థానంలో ఇద్దరు ప్రభుత్వ అధికారులను నామినీలుగా నియమించారు. గవర్నర్ చర్యను రాజ్యాంగవిరుద్ధం అని ఆప్ విమర్శించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా