యాదయ్యను హత్య చేసింది కుటుంబ సభ్యులే..
తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో అమ్మపల్లి యాదయ్య(50)ని ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులే హత్య చేశారని నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
- భార్య, కూతురు, అల్లుడు అరెస్టు
- మీడియా సమావేశంలో వెల్లడించిన డీఎస్పీ
నాగర్‌కర్నూల్, జూన్ 26 : తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో అమ్మపల్లి యాదయ్య(50)ని ఈ నెల 23వ తేదీన కుటుంబ సభ్యులే హత్య చేశారని నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు వెల్లడించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన అమ్మపల్లి యాదయ్య కూలీ పని చేసుకుం టూ జీవనం సాగించేవాడన్నారు. యాద య్య తన కూతురుని మిడ్జిల్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుకు ఇచ్చి పెండ్లి చేశారు. ఈ క్రమం లో తనకు ఉన్న భూమిలో ఎకరన్నర భూ మిని తన అల్లుడికి రిజిస్టర్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయంపై రెండేళ్లుగా భార్య అలివేల యాదయ్యను ఒత్తిడి చేస్తోంది.
అందుకు నిరాకరించిన యాద య్య తరచూ భార్యతో ఘర్షణ పడేవాడు. తన భార్య అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తరచూ గొడవపడుతుండేవాడని, ఇదే క్రమంలో యాదయ్యను చంపితే అల్లుడికి భూమి రిజిస్టర్ చేయొచ్చు, తనకు రైతు బీమా డబ్బులు వస్తాయని అనుకున్న యాదయ్య భార్య అలివేల అల్లుడు ఆంజనేయులు, కూతురు పద్మతో కలిసి యాదయ్యను చంపేందుకు పథకం వేసింది. ఈనెల 23వ తేదీన తన భర్తతో గొడవ పెట్టుకున్న అలివేల కూతురు, అల్లుడిని ఇం టికి పిలిపించింది. ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం ముగ్గురు కలిసి యాదయ్యతో భూమి రిజిస్ట్రేషన్ విషయమై గొడ వ పడ్డారు. ఈక్రమంలో అల్లుడు ఆంజనేయులు మామ గొంతుపట్టి గొడకేసి కొట్టా డు.
కిందపడగానే కూతురు రెండుకాళ్లు పట్టుకోగా భార్య అలివేల పక్కనే ఉన్న ఇనుపరాడ్డుతో ఛాతిపై కొట్టింది. అనంతరం పు రుషాంగాలను గట్టిగా పట్టి నలుమడంతో యాదయ్య అక్కడికక్కడే మరణించాడు. అనంతరం కూతురు, అల్లుడు అక్కడి నుం చి వారి స్వగ్రామానికి వెళ్లిపోయారు. మరుసటిరోజు యాదయ్య అనారోగ్యంతో మరణించినట్లుగా నమ్మించి అంత్యక్రియలు చే యబోయింది. ఈ క్రమంలో బంధువుల కు ఛాతిపై ఉన్న గాయాలు చూసి అనుమా నం కలిగింది. వారి బంధువైన గడ్డమీది పరశురాములు అనుమానంతో యాదయ్య భార్య అలివేలపై తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమో దు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా యాదయ్యను తన భార్య అల్లుడు, కూతురితో కలిసి హతమార్చినట్లు ఒప్పుకున్నది. ఈమేరకు గురువారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

